World Meditation Day | అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం -2024 | 21 December 2024
World Meditation Day | అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం -2024 | 21 December 2024
Press note పిఠాపురం 21-12-24
ఆత్మ శోధన కు మార్గదర్శనమైనది ధ్యాన శోధన అని ధ్యానం ద్వారా మానసిక సమతుల్యత,పరిపూర్ణత్వం లభించునని పీఠాధిపతి Dr Umar Alisha స్వామి చర వాణి ద్వారా వారి అనుగ్రహ భాషణ చేశారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ధ్యాన మందిరం లో నిర్వహించిన ధ్యాన సాధనను ఉద్దేశించి పీఠాధిపతి Dr Umar Alisha స్వామి ప్రసంగించారు. భారతీయ సంస్కృతి లో పురాతనమైన,ఉత్కృష్టమైనది ధ్యాన సాధన. ధ్యానం మూలం మిథం జగత్ అనగా ఇహానికి,పరానికి వారది ధ్యానం. ఈ పీఠం ప్రభోధం చేయు త్రయీ సాధన లో మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ఇహానికి,పరానికి వారిది అనగా శారీరక, మానసిక వ్యవస్థ ను నియంత్రిస్తూ,సమాజం లో సుఖంగా, శాంతి గా జీవిస్తు, ముముక్షత్వం పొంది తరించు మార్గము ద్వారా జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చని పీఠాధిపతి Dr Umar Alisha అన్నారు. పీఠం సెంట్రల్ కమిటీ సభ్యుడు శ్రీ AVV సత్యనారాయణ మాట్లాడుతూ ధ్యాన సాధన విధానం వివరించి, ధ్యానం అంతర్ దృష్టిని అభివృద్ధి చేయునని అన్నారు. పీఠం కన్వీనర్ శ్రీ PERURI SURIBABU ధ్యానం యోగా లో ఒక భాగం అని చెబుతూ యోగా ద్వారా శారీరక ,మానసిక ఆరోగ్యం చేకూరీ,ప్రశాంతంగా జీవితాన్ని గడప వచ్చునని, ఎంత పెద్ద సమస్యనైనా చిన్నది గా ఊహించుకుని, పరిష్కరించుకోగల మానసిక శక్తిని ధ్యానం ద్వారా పొందవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ S. కృష్ణ కుమార్ సాంకేతిక సహాయం అందచేశారు. వందలాది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇట్లు,
Peruri suribabu,
కన్వీనర్,
98489 21799