Viswaguru World Records Ugadi Puraskaralu Kakinada 2025

ప్రెస్ నోట్ కాకినాడ 28-3-25
నేటి ఆధునిక యాంత్రిక యుగంలో మానవాళి కి శాంతి, సహనం అవసరం అని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహ భాషణ చేశారు. శనివారం ఉదయం కాకినాడ మహా నగరం రాయల్ పార్క్ హోటల్ లో విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది పురస్కారాలు 2025 సభ కు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి శ్రీ సత్యవోలు రాంబాబు గారు సభ కు అధ్యక్షత వహించగా, పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా గారు మరియు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ వీర శంకర్ గారు, APSP బటాలిన్ కమాండెంట్ శ్రీ డాక్టర్ కొండా నరసింహారావు వారి శ్రీమతి అలీవేలు మంగాదేవి ముఖ్య అతిథులు గాను, Prime 9 Health CEO శ్రీ కిషోర్, ఈవెంట్ వైస్ చైర్మన్ శ్రీ సత్యనారాయణ, సీనియర్ లీడర్ శ్రీ కృష్ణ శేషు, శ్రీ S. గోపాలకృష్ణ గారు వేదిక పై కార్యక్రమ నిర్వాహకులు గాను వ్యవహరించారు. వివిద రంగాల్లో సమాజానికి విశిష్ఠ సేవలు అందిస్తున్న 25 మందికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా గారి అమృత హస్తములతో శాలువ కప్పి, మొమెంటో లను బహూకరిoచారు.
విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్ అధినేత శ్రీ రాంబాబు గారు మాట్లాడుతూ వారు ముక్కుతో ఆర్ట్ వేయుట లో మహా నేర్పరి. వారు గిన్నిస్ బుక్ of వరల్డ్ రికార్డ్స్ వారు వరుసగా 3 సంవత్సరాలు గుర్తించ లేకపోవుట వల్ల పట్టుదలతో విశ్వ గురు వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పి నేనే అనేక మంది కళాకారులను గుర్తించాలి అనే దృఢమైన సంకల్పంతో ఈ రోజున మీ అందరి ఆధారాభిమానాభిమానాలతో మా సంస్థ విశ్వవ్యాప్తం అవ్వాలని కోరారు.
పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారు మాట్లాడుతూ అరిషడ్వార్గాలు మానసిక వ్యవస్థ పై ప్రభావం చూపుట వల్ల మానవుడు సహనం కోల్పోయి, అనేక రకాల దుఃఖములతో, అనారోగ్యంతో, మనశ్శాంతి ని కోల్పోయి, ఉత్కృష్టమైన మానవ జన్మ కు సార్ధకత కల్పించు కోలెకపోపుచున్నాడు అని అన్నారు. సహనం, శాంతి కోల్పోవడం వల్ల కుటుంబ వ్యవస్థ లోనూ, సామాజిక వ్యవస్థ లోనూ అనేక అనర్ధములకు దారి తీసి, శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణించి, నశించిపోవుచున్నాడు అని అన్నారు. మానవునిలో ఉన్న అద్భుతమైన ఈశ్వర శక్తిని వెలికి తీసి, ఉన్నత విలువలతో సమాజానికి సేవలు అందిస్తూ, మానవ సేవయే మాధవ సేవ అనే రహస్యాన్ని గ్రహించాలని, అటువంటి స్ఫూర్తి దాయకమైన 25 మందికి ఈ రోజున అవార్డు లతో సత్కరించుట, ఇంతటి మహోన్నత కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేయుట నాకూ ఆనంద ఆనందదాయకం అని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ప్రకృతిని సంరక్షించు కొనుటకు ప్రతీ ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటి, ప్రకృతి వైపరీత్యములను అధిగమించాలని మరియు అడవులు నరుకుట వల్ల అడవి జంతువులు జనావాసములపై దాడి చేయు చున్నవి. కావున ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు నిచ్చారు.
వైస్ చైర్మన్ శ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారిని నడిచే దైవం గా అభివర్ణించారు. Prime 9 Health CEO శ్రీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ నేను ఇంటర్వ్యూ చేసిన ప్రతి మేధావి నుండి ఒక్కొక్క రహస్యం గ్రహించి జ్ఞాన ధనం సంపాదిస్తూన్నా అన్నారు. నిద్ర పోయే ముందు 5 నిముషాలు చప్పట్లు కొట్టి ఆరోగ్యం పొందాలీ అన్నారు.
అవార్డు గ్రహీతలు అందరూ అతిథులతో ఫోటో దిగారు. వందన సమర్పణ అనంతరం జాతీయ గీతం ఆలపించిన తర్వాత సభ ముగిసింది.
ఇట్లు
శ్రీ పేరూరి సూరిబాబు

You may also like...