Sathguru Dr. UmarAlisha discourse at TANA 23rd Conference – Philadelphia, USA | 9th July 2023
Sathguru Dr. UmarAlisha discourse at TANA 23rd Conference – Philadelphia, USA | 9th July 2023
అమెరికా, ఫిలడెల్ఫియా నగరం లో జూలై 7 నుండి 9 వ తేదీ వరకు జరిగిన తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) 23వ మహాసభలకు సద్గురువర్యులు డా. ఉమర్ ఆలీషా స్వామి వారిని, భావి పీఠాధిపతి హుస్సేన్ పాషా గారిని తానా వారు ఆహ్వానంచినారు. జూలై 9వ తేదీన సద్గురువర్యులు డా. ఉమర్ ఆలీషా గారు ఆధ్యాత్మిక ప్రసంగం చేసినారు. తానా ఆధ్యాత్మిక కమిటీ అధ్యక్షులు శ్రీ సుబ్రమణ్య వారణాసి గారి ప్రారంభ ఉపన్యాసముతో సభను ప్రారంభించారు. డా. గొట్టుముక్కల రమేష్ రాజు గారు పీఠం యొక్క చరిత్రను తెలియ చేసారు. అనంతరం సద్గురువర్యులు డా. ఉమర్ ఆలీషా స్వామి ఈ సమాజంలో మానవతా విలువలు మరియు సమైక్యతా భావం యొక్క ప్రాముఖ్యత, అరిషడ్వార్గాల నియంత్రణ, త్రయీ సాధన (మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన) యొక్క ప్రభావం శరీరం పైన, మనస్సు పైన, ఆత్మ పైన ఏవిధంగా ఉంటుంది అనే అంశాల పై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా “బ్రహ్మర్షి” డా. ఉమర్ ఆలీషా, షష్ట పీఠాధిపతి వారిచే రచించబడిన ఖండకావ్యములు అనే గ్రంధము నుండి సేకరించిన కొన్ని పద్యములను ప్రముఖ కవి శ్రీ రోచిస్మాన్ గారు ఆంగ్ల అనువాదం చేసిన “IN EMOTION IT CONTINUES (ఇన్ ఎమోషన్ ఇట్ కంటిన్యూస్)” అనే పుస్తకమును ముఖ్య అతిధి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు ఆవిష్కరించారు. గీతమ్స్ చైర్మన్ శ్రీ భరత్ మతుకుమిల్లి గారు, తానా పూర్వాధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ గారు, శ్రీ కిరణ్ ప్రభ గారు, ప్రముఖ కవి శ్రీ అందె శ్రీ గారు, తానా చైర్ శ్రీ సుబ్రమణ్య వారణాసి గారు, తానా కో-చైర్ శ్రీ రవి వారణాసి గారు పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్నారు. ముఖ్య అతిధి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు సద్గురువర్యులు డా. ఉమర్ ఆలీషా గారి ఉపన్యాస సారాంశాన్ని సభకు వివరించారు. సద్గురువర్యులు డా. ఉమర్ ఆలీషా స్వామి వారిని తానా ఆధ్యాత్మిక కమిటీ వారు శాలువా మరియు జ్ఞాపికను బహుకరించి సత్కరించారు. ఈ కార్యక్రమమునకు తానా కార్యవర్గం సభ్యులు, తానా కు విచ్చేసిన ఇతర ప్రముఖులు శ్రీమతి చేంబోలు పద్మావతి గారు (కీర్తిశేషులు శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారి సతీమణి), అమెరికా లో నివసిస్తున్న శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సభ్యులు శ్రీ రాజు వి.కె. వేగేశ్న గారు, శ్రీమతి సునీత గారు, డా. గొట్టుముక్కల రమేష్ రాజు గారు, శ్రీ అడబాల వెంకటేశ్వర రావు గారు (వెంకీ), శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు మరియు తదితర పీఠం సభ్యులు పాల్గొన్నారు.
Paper Clippings
News Channels