“తాత్విక బాలవికాస్” 2022 వేసవి శిక్షణా శిబిరం ‘మే నెల 6వ తేది నుండి 13వ తేది’ వరకు నిర్వహించబడును
“తాత్విక బాలవికాస్” 2022 వేసవి శిక్షణా శిబిరం ‘మే నెల 6వ తేది నుండి 13వ తేది’ వరకు నిర్వహించబడును
విజ్ఞానం, వినోదం, విహారం, నూతనోత్సాహం, బహుముఖ వికాసం
2022 మే-06వ తేదీ నుంచి 13వ తేది వరకు వారంరోజులపాటు నూతన ఆశ్రమంలో అనుభవజ్ఞులైన శిక్షకులచే 9 నుండి 12 సం.ల వయస్సుగల 4,5,6,7 తరగతులు చదువుచున్న బాలబాలికలకు గురుకుల విధానములో వేసవిశిక్షణా శిబిరం నిర్వహించబడును. బాలలు ఈ వారంరోజులు ఆశ్రమంలోనే ఉండి శిక్షణపొందవలెను.
ఈ శిక్షణా శిబిరంలో పాల్గొనుటవలన చిన్నారులలో అనేక విద్యావికాసపరమైన నైపుణ్యాలు, పోటీతత్వంతో తనను తాను ధీటుగా తీర్చిదిద్దుకునే జీవన నైపుణ్యాలు ఏర్పడును. పీఠాధిపతుల ఆశీర్వాదంతో ఏర్పాటుచేయబడిన ఈ వేసవి శిక్షణ శిబిరంలో ఆసక్తి కలిగిన తల్లితండ్రులు తమ చిన్నారులను చేర్పించి ఈ అరుదైన అవకాశమును సద్వినియోగపరచుకొనవలెను.
మే 2వ తేదిలోపుగా నిర్ణీత ధరఖాస్తులో పేర్లను నింపి ఆన్లైన్లోగాని, ఆశ్రమ కార్యాలయములోగాని నమోదుచేసుకొనవలెను. ధరఖాస్తు ఫారములు కావలసినవారికి వాట్సప్ ద్వారా పంపించబడును వివరముల కొరకు ఆశ్రమ కార్యాలయము ఫోన్ నెం: 7416173699 ను సంప్రదించండి.
