తాత్విక బాల వికాస్ శిక్షణా తరగతులు గౌతమ్ ఘాట్ శాఖ నందు ప్రారంభ కార్యక్రమం నిర్వహించబడినది | 05 October 2024

Press Note: ప్రెస్ నోట్.
తాత్విక బాల వికాస్ శిక్షణా తరగతులు.
శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం వారు రాజమహేంద్రవరం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము గౌతమ్ ఘాట్ శాఖ నందు, తాత్విక బాల వికాస్ పిల్లలకు దసరా సెలవలు కాలంలో సేవా మార్గమే శ్రేయో మార్గమనే అంశముపై ప్రత్యేక శిక్షణ శిబిరం అక్టోబర్ 5,6 తేదీలలో నిర్వహించబడుచున్నది. ఇందులో ఏభై మంది 12 సం.నుండి 14 సం. ల బాలబాలికలు హాజరు అయినారు. పీఠం రాజమండ్రీ శాఖ కార్యనిర్వహక సభ్యులు శ్రీ దంతులూరి కృష్ణంరాజు గారు, ఎమ్ ఆర్ కె రాజు గారు, కరిబండ రాజుగోపాలం, పుల్లా కల్కీమూర్తి, వనపర్తి సత్యనారాయణ గార్లు శ్రీమతి కీర్తి లక్ష్మి గార్లు ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొని శిక్షణ ప్రేరకులు శ్రీమతి సీతా మహాలక్ష్మి, శ్రీ అద్దంకి అవినాష్ గార్లను సత్కరించారు. ప్రతీ ఒక్కరూ చిన్నతనం నుండే సేవాతత్పరతను నేర్చుకున్నట్లు అయితే వారిలో వ్యక్తిత్వ వికాసం,ఆత్మ వికాసం పెంపొందించుకునే అవకాశం కలుగుతుంది అని చెప్పారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా వారు సేవ యొక్క విశిష్టతను ఆధ్యాత్మిక ఉన్నతికి ఎలా ఉపయోగించు కోవచ్చునో తమ యొక్క అనుగ్రహ భాషణం దృశ్య మాధ్యమం ద్వారా పిల్లలకు వినిపించారు. పిల్లలు చిన్నతనం నుండి స్వయం సేవతో తనయొక్క సేవాభావాన్ని వ్యక్తం చేసుకుంటూ గురు సేవ, తల్లితండ్రులు సేవ,కుటుంబ సేవ,ఇరుగు పొరుగు వారి సేవ, దేశసేవ తో బాటు విశ్వమానవ సేవను కూడా అలవర్చుకోవాలని అప్పుడే మానవజన్మ సార్థకమౌతుంది అని అతిథులు తమ ప్రసంగాలలో పిల్లలకు బోధించారు. పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు శ్రీ ఎ.వి.వి. సత్యనారాయణ,శ్రీ ఎన్. టీ.వి.ప్రసాద్ వర్మ గార్లు ఈ కార్యక్రమం రూపకర్తలు గా వ్యవహరించారు. ప్రేరకులు శ్రీమతి సీతా మహాలక్ష్మి, శ్రీఅద్దంకి అవినాష్ గార్లను ఆశ్రమం శాఖ కమిటీ సభ్యులు సత్కరించారు..
ఇట్లు.
దంతలూరి కృష్ణంరాజు
9642872425

You may also like...