Swamy donated space to the pithapuram public at Old Ashram | 03 August 2023
3-8-2023న పరమ పవిత్రమైన పీఠాధిపతుల దివ్య సమాదులు కలిగిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం పూర్వాశ్రమం 100 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతున్న ముక్తిధామము. అటువంటి 100 సంవత్సరాల పైబడి పవిత్ర పీఠాధిపతుల దివ్య సమాధుల పుణ్యప్రదేశమునకు రక్షణగా తూర్పువైపు గోడ ఉన్నది. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం సరిగా నిర్మించకపోవుట వలన, రోడ్ ఇరుకుగా ఏర్పడి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుచున్నది. ప్రజల, రైతుల అభ్యర్ధన మేరకు ప్రజా ప్రయోజనార్ధం, వాహన రాకపోకలకు వీలు కల్పించే విధంగా 100 సంవత్సరాలకు పైగా పూర్వ పీఠాధిపతుల పవిత్ర సమాదులకు రక్షణ కల్పించిన గోడను పీఠాధిపతులు డా. ఉమర్ ఆలీషా సామాజిక స్పూర్తితో పూర్వశ్రమంలో కొంత స్థలమును దారి మార్గము కల్పించుట కొరకు కేటాయించారు. అందు నిమిత్తం గోడను తొలగించే కార్యక్రమం ఈరోజు ప్రార్ధన అనంతరం ఉదయం 9.36 ని.ల కు కమిటీ సభ్యులు మరియు వేలాదిమంది పీఠం సభ్యుల సమక్షం లో ఈ కార్యక్రమం నిర్వహించబడినది. ఈ గోడను తొలగించగా వచ్చిన ఇటుకలు మరియు మట్టి ఎంతో పవిత్రమయినవిగా సభ్యులు భావించి వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాదిమంది సభ్యులు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఇటుక మరియు మట్టి వారి వారి గృహాలకు మరియు పీఠం ఆశ్రమ శాఖలకు తీసుకు వెళ్లి పవిత్రంగా భద్రపరుస్తారు. నూతనంగా గృహ నిర్మాణం చేసుకునేవారు, తులసి కోట నిర్మాణం చేసుకునే వారు ఈ పవిత్రమయిన ఇటుకలను, మట్టిని వినియోగిస్తారు. ఈ కార్య క్రమంలో ప్రార్ధన అనతరం పూర్వం నుంచి ఉన్న రక్షణ గోడను తొలగిస్తున్నందుకు పూర్వ పీఠాధిపతులను క్షమించమని వేడుకుంటూ విజ్ఞప్తిని విన్నవించటం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేలాదిమంది సభ్యులు పూర్వ పీఠాదిపతుల సమాధులను దర్శించుకుని భోజన ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పీఠాదిపతి వారి సోదరుడు అహ్మద్ఆలీషా, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. #svvvap1472 #svvvap #sathgurudrumaralisha #Pithapuram
https://www.instagram.com/p/Cvh0zpZpgYA/?igshid=MTc4MmM1YmI2Ng==