శ్రీమద్భగవద్గీత అష్టావధానము మరియు కవిపండితులకు సత్కారము | 14 December 2024

Geethavadhanam – గీతావధానం | ‪@UmamaheswararaoYarramsetti‬ | 14th Dec 2024

అధ్యక్షులు : బ్రహ్మర్షి డా ॥ ఉమర్ ఆలీషా నవమ పీఠాధిపతులు
అవధాని : అష్టావధాని శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయము, తిరుపతి
సంచాలకులు : గురుసహస్రావధాని డా. కడిమిళ్ళ వరప్రసాద్ నరసాపురం

పృచ్ఛకులు

  1. శ్లోకదర్శనము :- శ్రీ లింగాల యాజ్ఞవల్క్య శర్మ
  2. సంఖ్యాదర్శనము :- శ్రీ జోశ్యుల కృష్ణబాబు
  3. అంత్యాక్షరి : – అష్టావధాని శ్రీ కాకరపర్తి దుర్గాప్రసాద్
  4. అఖండ పఠనము :- శ్రీ మార్ని జానకిరామ చౌదరి
  5. విలోమపఠనము :- శ్రీ దాయన సురేష్ చంద్రజీ
  6. అక్షర దర్శనము :- శతావధాని శ్రీ పోచినపెద్ది సుబ్రహ్మణ్యం
  7. వ్యస్తాక్షరి :- శ్రీ డా. వేదుల శ్రీరామశర్మ (శిరీష కవి)
  8. అప్రస్తుత ప్రసంగము :- శ్రీ సూరంపూడి వేంకటరమణ

వేదిక:
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము ప్రధాన ఆశ్రమము,
రైల్వే ప్లై ఓవర్ వద్ద – పిఠాపురం

మానవ మేధస్సుకు పదును పెట్టే మహోన్నతమైన అంశం అవధానం
…………………………………………………….
పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

మానవ మేధకు పదును పెట్టే మహోన్నతమైన అంశం అవధాన ప్రక్రియ అని, నేటి సమాజంలో అవధాన ప్రక్రియ లాంటి సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు లోపించడం వలన జడత్వం పెరిగి మానవుల్లో యుద్ధ కాంక్ష పేరుకు పోతుందని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. గీతా జయంతిని పురస్కరించుకుని శనివారం రాత్రి పిఠాపురం కాకినాడ రోడ్డునందలి పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో పీఠాధిపతులు బ్రహ్మర్షి డా. ఉమర్ అలీషా స్వామివారి అధ్యక్షతన గీతా జయంతి మహోత్సవాల్లో భాగంగా శ్రీమద్భగవద్గీత అష్టావధానం మరియు కవి పండితులకు సత్కారం సభలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ భగవత్ తత్వాన్ని మానవాళికి అందించే మహోన్నత కార్యక్రమం అవధాన ప్రక్రియ అని పేర్కొన్నారు. జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటువంటి అద్భుతమైన మార్గ దర్శనం భగవద్గీతలో ప్రసాదించబడిందని వెల్లడించారు. యుద్ధాలను నివారించడానికి భగవద్గీత సందేశం మానవాళికి ఎంతో అవసరమని సూచించారు. అవధాన కార్యక్రమాలు సమాజంలో విస్తరిస్తే మానవత్వం పరిఢవిల్లి మానవుడు మానవుడిగా మానవత్వపు విలువలతో మనుగడ సాగించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. అతి చిన్న వయసులో గీతావధానిగా గుర్తింపు తెచ్చుకున్న అష్టావధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావును అభినందించారు.

తదుపరి గురుసహస్రావధాని డాక్టర్ కరిమెళ్ల వరప్రసాద్ సంచాలకులుగా, తిరుపతి రాష్ట్రియ సంస్కృత విశ్వ విద్యాలయానికి చెందిన అష్టావధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు అవధానిగా జరిగిన భగవద్గీత అష్టావధాన కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదంగా ఆనందదాయకంగా కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా భగవద్గీత నందలి అనేక అధ్యాయాల్లోని విషయాలను ప్రస్తావించి వాటిని విశ్లేషిస్తూ పృచ్ఛకుల ప్రశ్నలకు అవధాని సమాధానాలు అందించిన తీరు సభికులను విశేషంగా ఆకట్టుకుంది.

కార్యక్రమం ప్రారంభంలో ప్రముఖ నాట్యాచార్యులు సప్పా దుర్గా ప్రసాద్ నేతృత్వంలో నటరాజ నృత్య నికేతన్ కు చెందిన నాట్య బృందం చేసిన ఆగమ శాస్త్ర ఆలయ నృత్య ప్రదర్శన వీక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.

అవధానం అనంతరం పృచ్ఛకులుగా వ్యవహరించిన లింగాల యాజ్ఞవల్క్య శర్మ, జోశ్యుల కృష్ణబాబు, అష్టావధాని కాకరపర్తి దుర్గాప్రసాద్, మార్ని జానకిరామ చౌదరి, దాయన సురేష్ చంద్రజీ, శతావధాని పోచినపెద్ది సుబ్రహ్మణ్యం, డాక్టర్ వేదుల శ్రీరామ శర్మ (శిరీష కవి), సూరంపూడి వేంకట రమణ మరియు నాట్యాచార్యులు సప్పా దుర్గా ప్రసాద్ మరియు వారి బృంద సభ్యులను పీఠాధిపతి ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.

అనంతరం కవిపండితులకు సత్కార కార్యక్రమంలో భాగంగా సుమారు నాలుగు వందలమంది కవులను నిర్వాహక బృందం ఘనంగా సత్కరించారు

no images were found

You may also like...