Spiritual Meeting conducted at Veerampalem on MahaShivarathri 18 Feb 2023
Press note
వీరంపాలెం WG DIST 18-02-2023
జీవన శైలి ని ఆదర్శంగా తీర్చి దిద్దువాడే సద్గురువు అని డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు.18-02-2023 శనివారం మహా శివరాత్రి పుణ్య కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెం గ్రామం లో బాలా త్రిపురసుందరి పీఠం పీఠాధిపతి శ్రీ గరిమెళ్ళ వెంకట రమణ శాస్త్రి గారు సభకు అధ్యక్షత వహించగా, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా స్వామి, ఉత్తర ప్రదేశ్ అడిషనల్ DGP శ్రీ రవీందర్ వేదిక నలంకరించి ప్రసంగించారు. ముందుగా మేళ తాళాలతో , పూర్ణ కుంభం తో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మహా శివరాత్రి పుణ్య కాలంలో స్పటిక లింగ ప్రత్యేక దర్శనం చేసుకుని జ్ఞాన సభకు హాజరయ్యారు. అనంతరం సభాద్యక్షులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకట రమణ శాస్త్రి గారు మాట్లాడుతూ పరమాత్ముడు పాదరసం లాంటి వాడని, ఈశ్వరుడు మనలోనే ఉన్నడని, మనలో ఉన్న ఈశ్వరుని సద్గురువు జ్ఞాన ప్రబోధ ద్వారా ఎరుక పరుస్తారని అన్నారు. గురువు మాట్లాడుతూ జ్ఞానాన్ని బోధిస్తారు. ఆలయానికి లేదా సద్గురువు వద్దకు వెళ్ళినప్పుడు మనకు కావలసిన అనేక కోర్కెలు కోరి యాచకునిగా మారవద్దు అన్నారు. చంటి పిల్లాడికి తల్లి అడక్కుండానే ఆకలి తీర్చినట్లు, సద్గురువు కూడా మన కోర్కెలు తీర్చుతాడని అన్నారు. మనలో మార్పు కోసం తపన పడేవాడే సద్గురువు, నీకు నీవుగా కష్టాన్ని పరిష్కరించుకునే జ్ఞానాన్ని ప్రసాదించు వాడే సద్గురువు అటువంటి గురువే డా. ఉమర్ ఆలీషా అని, వారి చిరునవ్వు ద్వారా సమస్తం ప్రసాదిస్తారు అని, వారు నాకు చిన్న నాటి స్నేహితులని, అమ్మ వారి ఆశీస్సులతో మా ఈ స్నేహం కలకాలం కొనసాగాలని కోరుతూ గురువు అంటే గురి కల్పించు వాడు అని అన్నారు. అనంతరం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ కాలమే ఈశ్వరుడిని అనుగ్రహ భాషణ చేశారు. జ్ఞానం బ్రహ్మ స్వరూపంగా ఉన్నది. జ్ఞానం ద్వారా ఆత్మ, పరమాత్మగా పరిణామం చెందు స్థితే అహం బ్రహ్మాస్మి అన్నారు . ఓంకార స్వరూపుడే ఈశ్వరుడిని, అకార, ఉకార మకార తత్వలుగా ఉన్నదని, అకార మనగా శారీరక తత్వమని, ఉకార మనగా మానసిక తత్వమని, మకార మనగా ఆత్మ తత్వము అని అన్నారు. మానవత్వము అనే ధర్మాన్ని ఆచరిస్తే, మనలో ఉన్న ఈశ్వరత్వం భౌతిక విధానంలో మనవత్వంగా తెలియ బడును. మానవత్వపు విలువలు మనలో పెంపొందించ గల్గితే, అర్షడ్వర్గాలు స్థాయి చెంది, శాంతి, సుహృద్భావాలు ఏర్పడునని డా ఉమర్ ఆలీషా అన్నారు. ధనార్జన, జ్ఞానార్జన లో ఏది గొప్పది అని స్వామి ప్రశ్నించారు. ధనార్జన భౌతిక సుఖాలతో పాటు, అర్షడ్వర్గాలను విజృంభింప చేయును. జ్ఞానార్జన ద్వారా ఏది మంచి, ఏది చెడు తెలియ చేసి, వేలాది కోట్లాది జీవాణువులలో జీవ చైతన్య పరిణామ శక్తి ప్రసరించబడి, ఓంకార స్వరూపమే ఈశ్వరుడిని అనుభవంలో గ్రహింప చేయువాడే సద్గురువు అని అన్నారు. పంచభూతాల సమతుల్యత కోల్పోకుండా ప్రతీ ఒక్కరూ మూడు మొక్కలు నాటి, బ్రహ్మ , విష్ణు, పరమేశ్వరులు గా, వాటిని పెంచమని పిలుపు నిచ్చారు. శాస్త్ర విజ్ఞానాన్ని మించినది ఆధ్యాత్మిక తత్వమని డా. ఉమర్ ఆలీషా స్వామి అన్నారు. ఆధ్యాత్మిక పరిమళాలను ఈ మారు మూల గ్రామంలో ఏర్పాటు చేసి, ఇక్కడున్న ప్రతీ అణువు భగవత్ సంపదగా తీర్చి దిద్ది,ఈ గ్రామానికి ఒక విశిష్టత తీసుకు వచ్చారని శ్రీ గరిమెళ్ళ వెంకట రమణ శాస్త్రి గార్ని అభినందించారు. అనంతరం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వార్ని శాస్త్రి గారు శాలువా తో సత్కరించి,పుష్ప మాలాంకృతుల్ని చేసారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వందలాది సభ్యులు, భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
ఇట్లు
పేరూరి సూరిబాబు,
పీఠం కన్వీనర్,
9848921799

సభకు వెళ్ళే ముందు 94 సంవత్సరాల శ్రీమతి సీతయ్య గార్ని స్వామి వారు కలుసుకుని, వారి భాగోగులు అనేక విషయాలు మాట్లాడి, శాలువా కప్పి సత్కరించారు.
