Sathguru Dr Umar Alisha visits Malaysia

                 పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా మలేషియా పర్యటన

 మలేషీయాలోని పీఠం సభ్యులు మరియు మలేషీయ తెలుగు సంఘం వారి ఆహ్వానం మేరకు శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా , మలేషియా పర్యటించి తమ దివ్యసందేశాన్ని అక్కడ తెలుగు ప్రజలకు అందించారు.

శనివారం.22-8-2015, న      తొలితగా కౌలాలంపూర్ లో ఆధ్యాత్మిక సభ నిర్వహింపబడింది. తరువాత సోమవారం 24-8-2015 తేదీన. మలేహియ తెలుగు సంఘం వారి ఆధ్వార్యంలో పేరాక్, సుంగై సుమన్ గల శ్రీ వేంకటేశ్వర దేవస్థానం నందు ఆధ్యాత్మిక సభ నిర్వహింపబడింది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆసభలో మలేషియ తెలుగు సంఘం వారు డా. ఉమర్ ఆలీషా గారిని సాదరంగా ఆహ్వానించి, దుస్సాలువతో సత్కరించారు.

22-8-2015 Sabha Photo Gallery

[Not a valid template]

22-8-2015 Recorded Video

ఈ సందర్భంగా పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా మాట్లాడుతూ “సుమారు 4 , 5 తరాల క్రితం ఉత్తరాంధ్ర రాష్ట్రాల నుండి మలేషియ వచ్చి , ఇప్పటికీ తెలుగు సాంప్రదాయన్ని తెలుగు సంస్కృతిని తెలుగు భాషను పరిరక్షిస్తూ తెలుగు వారి యొక్క ఔన్నత్యాన్ని చాటుతున్న మలేషియ తెలుగు వారినందరినీ అభినందిచారు. తాత్వికజ్ఞానం ద్వారా మనలో ఉన్న ఈశ్వరుని తెలుసుకొని, ప్రతి అణువులోను భగవంతుడు నిండి ఉన్నాడని, తనలోనూ నిండి యున్నాడని , మానవత్వమే ఈశ్వరత్వమని గ్రహించాలని అన్నారు. మానవుడు పరిపూర్ణమానవునిగా పరిణామము చెందాలంటే ప్రతిఒక్కరికి సామాజిక సేవ ఒక నేత్రం, ఆధ్యాత్మిక తత్త్వం మరొ నేత్రం గా, ఉండాలి అన్నారు. దశదిశా నిర్దేశము చేయునదే ఆధ్యాత్మిక తాత్వికజ్ఞాన మని , మానవునిలో అర్షడ్వర్గాల రూపంలో ఉన్న రాక్షసుణ్ణి ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా స్తాయి పరుచుకోవచ్చని , మనస్సుకు ఆధ్యాత్మిక జ్ఞానమనే ఆహారాన్ని ప్రసాదింపచేసి మానసిక మాలిన్యాలను నిర్ములించుకోవచ్చునని, ఆధ్యాత్మిక గ్రంధ ఫఠనం ద్వారా అజ్ఞానాన్ని నిర్మూలించుకుని, జ్ఞాన స్వరూపిగా పరిణామం చెందాలని డా.ఉమర్ ఆలీషా అన్నారు. ఆధ్యాత్మిక తాత్విక గ్రంధ పఠనం ద్వార మనస్సు బలీయమై అర్షడ్వర్గాల దాడి నుండి రక్షించుకోగల్గి,యౌగిక జ్ఞానం ద్వారా ఆత్మ జ్ఞానస్వరూపిగా, పరిణామం చెందగల్గుచున్నాడని అన్నారు. ఒక కాలంలో శ్రీరామునిగా, శ్రీకృష్ణుని గా , మహమ్మద్ ప్రవక్తగా, ఏసుక్రీస్తుగా, బుద్ద భగవానునిగా, అవతరించి, ఈశ్వరవాణిని, అమూల్యమైన ధర్మంగా ప్రకటింపబడిందని, జ్ఞాన చైతన్యంద్వారా ,జీవాత్మ జ్ఞాన నేత్రంద్వార పరమాత్మ స్వరూపంగా పరిణామం చెంది ముక్తస్వరూపునిగా మానవుని తీర్చిదిద్దువాడే సద్గురువని, ఆధ్యాత్మిక – తాత్విక జ్ఞానం ద్వారా ఆర్ష సూఫీ సిద్దాంత స్పూర్తితో తన మోక్షము తన చేతిలోనేకలదన్న రహస్యాన్ని,మతాతీత ఆధునిక మానవతా దేవాలయమైన శ్రీవిశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ద్వారా, జ్ఞానప్రభోద చేస్తున్నామని అన్నారు”

ఈ కార్యక్రమములో తరతరాలుగా మలేషీయాలో స్థిరపడిన తెలుగు వారు, సింగపూర్ , స్వీడన్, దేశాలలో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

24-8-2015 Sabha Photo Gallery

[Not a valid template]
ఈ కార్యక్రమములో దేవస్థానం ధర్మకర్త డి. శ్రీ రాములు, దేవస్థానం అధ్యక్షులు ఎస్. ఆనందరావు, భగన్ దత్తో శాఖ అధ్యక్షులు రామ నాయుడు, పీఠం సభ్యులు పి. రేణు కుమార్, డా. పింగళి ఆనంద కుమార్ , పి. ఉష, టి. మురలీకృష్ణ, జి. సత్యనారాయణ పాల్గొన్నారు.

డా.ఆనంద కుమార్ పింగళి

ప్రోగ్రామ్ కన్వీనర్

సెల్.నెం.9866388979

Print Media coverage:

[Not a valid template]

You may also like...