7-12-23 గురువారం, 250 మంది సాధు సంతులు పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాన్ని దర్శించారు

Press note
7-12-23 గురువారం అనగా ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు ఉత్తర భారత దేశం నుండి ముఖ్యంగా గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ , ఒరిస్సా, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ తదితర రాష్ర్టాల నుండి సుమారు 250 మంది సాధు సంతులు పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాన్ని దర్శించారు .

శ్రీ తల్లాద్వార్ గద్యాచార్ మంగళ్ పీఠాధిపతి శ్రీ మహన్త్ మద్వాచార్ జీ మహారాజ్, ముంబయ్ వారు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని రక్షించడానికి, మాతా గోదావరి మాత కలుషితం కాకుండా, ఆధ్యాత్మిక విలువలు విస్తరింప చేయటానికి మా గురువులు అందరూ సమైక్యంగా పర్యటిస్తున్నామని అన్నారు. ఈ రోజు గురువారం ఆరాధన లో కూడా పాల్గొన్నారు. ఈరోజు రాత్రికి మా నూతన ఆశ్రమం లో విశ్రాంతి తీసుకుంటారు. ఈ సందర్భంగా వారికి పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు, సెంట్రల్ కమిటీ సభ్యులు శ్రీ AVV సత్యనారాయణ, వారికి స్వాగతం పలికి శాలువాలతో సత్కరించి పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి వారిచే హిందీ లో రచింపబడిన విజ్ఞాన జ్యోతి గ్రంథాలను, ప్రసాదాన్ని బహూకరించారు. గురువు గారి సోదరుడు అహ్మద్ ఆలీషా గారు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో హిందీ టీచర్ శ్రీమతి సుజాత గారు గురువుల హిందీ ప్రసంగాన్ని తెలుగు లోకి అనువదించారు.
ఇట్లు,
పేరూరి సూరిబాబు,
కన్వీనర్,
9848921799.

You may also like...