ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 81| 5th August 2023
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 81
వక్తలు :
- శ్రీమతి చెనుమోలు రామలక్ష్మి, అమెరికా
- శ్రీ నడింపల్లి వాసు వర్మ, విశాఖపట్నం
169 వ పద్యము
వెలుఁగును జూచి యా వెలుఁగు వెన్నెలకన్నను తేటుగాఁగ నీ
వెలుఁగునఁ బోల్చి యా వెలుఁగు వెళ్ళిన మేరకుఁ జూపు నిల్పి నీ
తెలివిని మాటుచేసి యట తేటగఁ దోఁచెడు బాటలోన నీ
వలయకపొమ్ము విశ్వమున కవ్వలి స్వర్గము దోఁచునచ్చటన్.
170 వ పద్యము
తెలిసిన సద్గురుండు తన తేజము శిష్యుని వైపు పెట్టి ని
ర్మలిన వికాసరూపమున మాయను మాయను జేసి చీఁకటిన్
దొలఁగఁగఁ ద్రోసి యాత్మ తనతోఁ జనుదేరఁగ మూఁడు లోకముల్
వలగొని దేహబంధములు వాయ ముముక్షుని సేయు నెంతయున్.