ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 8| 12th Mar 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 8

వక్తలు:
శ్రీ చవటపల్లి సాయి వెంకన్న బాబు, భీమవరం
శ్రీమతి అరుణ కుమారి, కాకినాడ

11వ పద్యము:

ఈచరాచరసృష్టి యీ మహాసౌందర్య
మెవనిలో నణువుగా నెసఁగుచుండు
ఈకళాలోకంబు నీయైంద్రజాలంబు
లెవని యాకాంక్షమై యెనసియుండు
ఈయంతరాళంబు లీ యుడువీధులు
నెవనిలో నలుసులై నవయుచుండు
ఈప్రేమప్రళయాలు ఈ రాగరసములు
నెవరిసంకల్పాన దవిలియుండు
అట్టియీశ్వరుఁ డన్ని తా నైన ఘనుఁడు
ఆయగోచరుఁ డిద్ద మాయామయుండు
ప్రేమహృదయాల నిల్చి కాన్పించు ప్రభుఁడు
కరుణ గలవాఁడు నిఖిలలోకములరేడు.

12వ పద్యము:

స్వామీ: నిన్ను మనస్సులో తలఁపులో సర్వంసహాచక్రమం
దేమూలన్ బడి దాగియుంటివని నే వీక్షించి వేసారి నీ
వేమార్గంబునఁ గానరామి వగలన్ నిట్టూర్పులన్ బుచ్చుచున్
భూమిన్ వ్యర్థనిషిద్ధ జీవితము నే పూరింపఁగా నేర్తునే.

You may also like...