ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 7| 05th Mar 2022
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 7
వక్తలు:
శ్రీమతి నాగ స్రవంతి రుద్రరాజు, విశాఖపట్నం
శ్రీమతి దంతులూరి సుశీల, రాజమండ్రి
9వ పద్యము:
సగుణబ్రహ్మముగాఁ దలంతురు నినున్ సన్యాసులున్ యోగులున్
నిగమంబుల్ నిగమాంతభాష్యచయముల్ నిన్నే యుపాశించు నా
భగవంతుండవు దేవదేవుఁడవు నిన్ బ్రార్థించువా రెల్లరున్
వగలన్’ బాసి తరింతు రీప్సితమహాభాగ్యంబులన్ బొందుచున్.
10వ పద్యము:
ప్రభుపూజారిని నేను నాతనిమహాభాగ్యంబు నాసొత్తు గా
నిభయూధంబుల నెత్తికొన్న నిసుమంతే తగ్గిపోలేదు మీ
కభయం బాతని దోఁచుకొండని భవాద్యాహారనిర్వ్యాణదుం
దుభి మ్రోయించెద రోదసీకుహరసందోహంబు మార్మ్రోయఁగన్.