ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 55| 04th February 2023
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 55
వక్తలు :
- శ్రీమతి పాకలపాటి సరస్వతి, విజయనగరం
- శ్రీమతి శ్రీశైలపు భవానీదేవి, విశాఖపట్నం
117 వ పద్యము
జగము మిథ్యని కొందఱు చాటుచుంద్రు
బ్రహ్మ మిథ్యని కొందఱు బలుకుచుందు
రిర్వురిటు మిథ్యావాదులే జగాన
నేదియును మిథ్య గాదు నీ వెఱిఁగియున్న.
118 వ పద్యము
శంకము మాంసమిశ్రితవసామలినంబును దీసివేసి యా
శంకరుమ్రోల పూజలనుసల్పెడు నోరుగడించుకొన్నదా
వంకను ముక్కలై మురళిపాడుచునున్నది కృష్ణునోట నీ
పంకమువీడితే హరిని వాకిటఁగట్టెద వెల్లకాలమున్.