ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 47| 10th December 2022
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 47
వక్తలు :
- శ్రీమతి తోట రాజేశ్వరి, తిరుపతి
- శ్రీ మరిపి రమణ, వైజాగ్
100 వ పద్యము
గృహమందునున్ననే గుహలందు డాఁగిన
జ్ఞానంబు ఫలమును గాంచవలయు
విజ్ఞాన మీశ్వర జిజ్ఞాస వ్యవసాయ
మట్లు ఫలప్రదమై తనర్చు
జీవజడత్వ విచ్ఛిన్నంబుఁజేసి యం
దమృతస్వరూపంబు నందవలయు
పగలు రేయను కాండపటముల మాటున
మరుగైన శక్తిని యెఱుఁగవలయు
అదియె యోంకారమీవని యరయవలయు
బిందునాదంబు కళయందుఁ బెట్టవలయు
ప్రకృతి జీఁకటి యను తెరఁ బాయవలయు
నీవు నీవైన చోటులో నిలువవలయు.
101 వ పద్యము
చెప్పుఁడు జ్ఞాననేత్రములచేఁ దిలకించినవన్ని సత్యముల్
జెప్పుఁడు భక్త లోకము మలీమసమైన భవాబ్దిదాటఁగా
దెప్పలఁబోలు దీక్షలను తెల్వినిజీఁకటి పోవుదీపికల్
గుప్పలుగావెలుంగు మతిఁగూర్చుఁడు పామరులడ్డు చెప్పినన్.