ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 38| 08th October 2022
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 38
వక్తలు :
- శ్రీ గోపిశెట్టి రామప్రసాదరావు , రావులపాలెం
- శ్రీ యర్ర క్రిష్ణ కిషోర్, లండన్
81 వ పద్యము
జ్ఞానరహస్య మంతయు నొకానొకమానవుఁడే గ్రహించి లో
కానకుఁ జాటలేదు కడుకష్టముతోడఁ బరంపరంబుగా
దీని నెఱింగి యా తెఱవుదీసి హృదంతరదగ్ధబీజముల్
పూని పెకల్చి ప్రేమరసపూరితతేజము గాంచి రాదెసన్.
82 వ పద్యము
అట్టిపథమున నుత్తీర్ణులైననారు
కృష్ణుఁడు పిరానెపిర్ మహర్షి యును వేద
ఋషులు శ్రీమహమ్మదురసూ లిధ్ధచరితు
లెనయ నీజ్ఞానవాహిని వనులఁబాఱె.
83వ పద్యము.
భౌతికమున్ ద్రికాలపరివంచిత దృశ్యధరాప్రపంచ సం
జాతము శూన్యమైన నిది స్వప్నముబోలిన దైన దీనిలో
లోతు సుషుమ్నమార్గమున లోచనముల్ నిగుడించి జ్యోతిలో
జ్యోతిని జూడవచ్చు నల శూన్యములోనె యగాధసత్యమున్