ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 19| 28th May 2022
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 19
వక్తలు:
1. శ్రీమతి కిలారి దీప్తి, హైదరాబాద్
2. శ్రీమతి నిడదవోలు శివరాణి, హైదరాబాద్
39వ పద్యము.
కవితనెఱుంగనట్టి పృథుకాలము వ్రాసితి పుస్తకంబు లా
కవితనెఱింగి వ్రాయుటకు గంటమురాదు నుపన్యసించు నా
దినముల విద్యతోఁ గలసి తృప్తి ఘటించెడు వాని నిప్పుడో
లవము నుపన్యసించుటకు లజ్జ ఘటించెడు నేమి చెప్పుదున్.
40వ పద్యము
ఢిల్లీభారత శాసనైకసభ రూఢిన్ బ్రాతినిధ్యంబు సం
ధిల్లన్ జేరి మహత్తరోజ్జ్వల కళాధిక్యంబు రాజిల్ల వి
ద్వల్లోకంబున రాజకీయకలనా వ్యాపారపారంగతం
బెల్లన్ వేడ్కను నిర్వహించుచును నేనీ గ్రంథమున్ వ్రాసితిన్.