ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 167| 29th March 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 167
వక్తలు :
- శ్రీ యర్రంశెట్టి ఉమేష్ కుమార్, బల్లిపాడు
- శ్రీ వింజరపు విజయ్ బాబు, పిఠాపురం
343 వ పద్యము
సీ. మతములన్నియుఁ బోవు మతవాదములుఁ బోవు
జ్ఞానమాదర్శమై గ్రాలఁగలదు
విద్యలన్నియుఁ పోవు విన్నాణములుఁ బోవు
విజ్ఞానదీక్షయే వెలయఁగలదు
శాస్త్రంబులును బోవు శస్త్రంబులును బోవు
తన మనచ్ఛక్తియే తనరఁగలదు
రాజ్యంబులును బోవు రారాజులును బోదు
రీశ్వరరాజ్యమే యేలఁగలదు
తే.గీ. శాంతి చేకుఱు నన్నవస్త్రములు గలుగు
నీతిబాధలు మొదలంట నెగిరిపోవు
ప్రేమ సెలయేళ్ళు పాఱు హృద్వీధులందు
నదియె విజ్ఞానదివ్యరాజ్యార్థ మరయ.
344 వ పద్యము
చ. చెడితి నటంచుఁ దానొకటి సేయఁడు చేసెడివెల్ల చెప్పి వె
ల్లడిగ నొనర్చు దాన పరలాభము లేదనుకొన్న మోసమున్
బొడమదు నైతికం బనుచు బొంకుచు చెప్పెడిదొండువాఁడు చే
సెడిది మఱొండు నీయఘము చిచ్చయి కాల్చదె యంతరంగముల్