ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 164| 08th March 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 164

వక్తలు :

  1. శ్రీమతి కేశవరపు లక్ష్మి, అచ్చంపేట
  2. శ్రీ సుంకర శివ దేవి గణేష్, కాపవరం

337 వ పద్యము
ఉ. అచ్చపు జీవితంబు కలయట్టిది జీవుని బంధమోక్షమి
ట్లెచ్చటి నుండి వచ్చినవొ యీశ్వరుఁడెవ్వరొ యేది పుట్టుచున్
జచ్చుచు నున్నదో తెలియఁజాలని భ్రాంతి తపస్వి నిద్ర పో
వచ్చునె యీ జవంజవము బాసి తమస్సును గెల్వఁగావలెన్.

338 వ పద్యము
ఉ. కొందఱు విద్యచేతఁ దమకున్ ద్రిజగంబు లెఱుంగవచ్చునం
చందురు కొందఱాత్మవిదులై సచరాచర భూతకోటి మా
యందు ప్రదీప్తినొందు నని యందుఱు కొందఱు మోసగాండు రీ
చందము లన్ని యున్నవని సాకులు పల్కుదు రర్థకాములై.

You may also like...