ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 157| 18th January 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 157
వక్తలు :
- శ్రీమతి తోట ఉమామహేశ్వరి, బల్లిపాడు
- శ్రీమతి నిమ్మా చంద్రావతి, హైదరాబాద్
323 వ పద్యము
ఉ. తృప్తి జయంబులోఁ గలదు తృప్తిని దుర్జయమందు గూడ సం
ప్రాప్తము జేసికొమ్ము మధుపానము చేసినవాఁడు హాయిగా
సుప్తిని జెందునట్టు పరిశుద్ధ మనోమయికంబు యౌగికా
వ్యాప్తిని నిస్పృహన్ బడయనందు ప్రశాంతత వచ్చు నంతటన్.
324 వ పద్యము
ఉ. పోయెడు దానికై వగవఁబోవకు మెప్పుడొ కాలగర్భమం
దీయఖిలంబు దాగి యగుపించదు యున్న దినాలలో సుధా
మేయమనోజ్ఞజీవిత నిమేషము నీదని జ్ఞానయోగ మై
రేయము ద్రావుచున్ బవలు రేలు వినోదము బుచ్చు నెచ్చెలీ!