ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 152| 14th December 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 152
వక్తలు :
- శ్రీ వనపర్తి సత్యనారాయణ, రాజమహేంద్రవరం
- శ్రీ యర్ర కృష్ణ కిశోర్, లండన్
313 వ పద్యము
వేదాంతంబన పారిభాషిక పదావిర్భూత వాక్యార్థ సం
వాదానూనకుతర్క లోక కుహనాబద్ధంబుగాఁ బోవ దిం
దేదో పెద్ద నిగూఢసత్యము మహాస్వేచ్ఛావిహారక్రియా
మోదంబున్ రసమున్ బ్రియంబు నిజమున్ మోక్షంబు నొప్పారెడున్.
314 వ పద్యము
పోయిన కొంపలో చివికిపోయిన కఱ్ఱలలీల మాంసమున్
బోయిన యస్థిపంజరము బొత్తిగ నేలకు వంగిపోయె న
య్యో! యగుపించఁడీశ్వరుఁడు ఊహకుఁ దోఁచని యీ నిశీధిలోఁ
బోయిన నేమిలాభ మనిపోయెను బుద్ధుఁడు నాస్తికాకృతిన్.