ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 15| 30th April 2022
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 15
వక్తలు :
1.చిరంజీవి పింగళి ఉమాశేషా వరప్రసాద్, హైదరాబాద్
2.శ్రీమతి జంపాల సుహాసిని, హైదరాబాద్
3.శ్రీమతి గంట విజయలక్ష్మి, హైదరాబాద్
30వ పద్యము.
ఆమొహియద్దీన్ బాద్షా
నామమహాయోగి కగ్రనందనుఁడను నా
నామహితాగమ హిత వి
ద్యామతి “ఉమ్రాలిషా” మహాకవి నేనున్.
31వ పద్యము
రచియించినాడ విభ్రాజితదివ్య ప్ర
బంధముల్ పది కావ్య బంధములుగ
వ్రాసినాడను కల్పనాసక్త మతి పది
నాటకంబులను కర్నాటఫక్కి
కూర్చినాఁడను కళాకోవిదుల్ కొనియాడ
నవలలు పది నవనవల లనఁగ
తెనిగించినాఁడ నుద్దీపితాఖండపా
రసికావ్యములు పది రసికులలర
రసము పెంపార నవధానక్రమములందు
ఆశువులయందు పాటలయందు కవిత
చెప్పినాఁడ నుపన్యాస సీమలెక్కి
యవని “ఉమ్రాలిషాకవి” యనఁగ నేను.
32వ పద్యము
రాజులఁ జూచితిన్ సుకవిరాజుల నోర్చితిఁ బేరుమ్రోయ రా
రాజులనోలగంబుల విరాజిత పండిత సత్కవీంద్ర వి
భ్రాజిత మౌలవీబిరుద పట్టములందితి యూనివర్సిటిన్
దేజముమీఱ సభ్యుఁడయితిన్ మతబోధకుఁడైతిఁ గ్రమ్మఱన్.