ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 144| 19th October 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 144

వక్తలు :

  1. శ్రీమతి దంతులూరి సుశీల, రాజమహేంద్రవరం
  2. శ్రీమతి గుర్రాల ఉమాశ్రీ వినయవతి, విశాఖపట్నం

297 వ పద్యము
దేహాభిమానంబు తీండ్రించునందాఁక
జ్ఞానమార్గంబులో స్థానమేది
భక్తుని గురువు రాపాడించి పీడించి
చిచ్చులోపల పరీక్షించవచ్చు
సన్యాసిఁ జేసిన సామ్రాట్టుఁ జేసిన
స్వామి నీవే యను భక్తవరుఁడు
అపరోక్షవిజ్ఞానమైన మోక్షమునకు
సోపానములు గట్టి చూరఁ గొనును

తేలిపోయినవారు పాతాళమునకు
జారిపోదురు నుభయభ్రష్టతను జెంది
భ్రాంతులను బొంది డింది యాక్రందనమున
క్రిందిమెట్లకు దిగిపోయి కీర్తి బాసి.

298 వ పద్యము
వంటకుఁ గుండ త్రవ్వుటకు పారయు దుక్కికిఁ గోల వ్రాతకున్
గంటము లెట్లగత్యమొ యగత్యము దేహము మోక్షసిద్ధి కీ
యొంటిని కూటికుండవలె నుంచినఁ జీఁకయిపోవు దుక్కికిన్
గంటము వాడినట్లగును గావున భక్తుడు మేలుకోవలెన్.

You may also like...