ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 143| 12th October 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 143
వక్తలు :
- శ్రీమతి యిర్రి ఉమా పద్మా, అత్తిలి
- శ్రీ సువ్వాడ చంద్రశేఖర్, హైదరాబాద్
295 వ పద్యము
విద్యాకౌశలమున్ గవిత్వమును విద్వేషించి గర్వించు సం
వేద్యావద్యుల రబ్బువారిని ఖురాన్ విన్నాణసత్కావ్యమున్
హృద్యంబౌ శ్రుతు లీశ్వరుం దెలిపి నిర్జించెన్ మహమ్మద్ రసూ
లాద్యంబైన రసస్వరూప సముపాస్యచ్ఛాంతి సంధిల్లఁగన్.
296 వ పద్యము
లోకవాంఛలఁ గుంది లోలతఁ గడు జెంది
పురుగులవలె చెడిపోవవలదు
మతమతాంతర వామమార్గాలఁ బడి బ్రహ్మ
భావంబు తేజంబుఁ బాయవలదు
జ్ఞానమహాసభాస్థానంబు విడనాఁడి
పరధర్మములఁ జేరి మురియవలదు
ఈ జన్మఁ గాకున్న పై జన్మలో మోక్ష
మొందవచ్చని మోస మందవలదు
తిరిగి యీ జన్మ రాదు మృతి యనెడు సుడి
గాలి హతమార్చుఁ దుదకు నే గడ్డివలెనొ
మొలిచి పూలు పూచియు రాలిపోవునట్లు
పోవుదురు జీవు లారీతిఁ పోవవలదు.