ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 140| 21st September 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 140

వక్తలు :

  1. శ్రీమతి యర్ర అరుణకుమారి, కాకినాడ
  2. శ్రీమతి తోట లక్ష్మీ ఉమా, జాలిపుడి

289 వ పద్యము
విశ్వరూపము జూపి విశ్వజ్ఞుఁడగు కృష్ణు
డా రూఢిచే నవతారుఁడయ్యె
ఆకాశసీమలపై కెక్కి నిజతేజ
మగపర్చి మహమద్ పయంబరయ్యె
చచ్చినవారిని దెచ్చిన లేపి పం
పిన క్రీస్తు దేవుని బిడ్డడయ్యె
జనమేజయుని యజ్ఞశాల సర్పాల నా
కర్షించువారు మహార్షులైరి

ఇట్టులెందరెందరు విజయేచ్ఛచేత
మహిత మహనీయ మాహాత్మ్య మార్గమునను
మానవాదర్శభావులై మతిని గెలచి
జగము తరియింపజేసిరా నిగమనుతులు.

290వ పద్యము
మూసాకాలము నాఁడు మాంత్రికులు సంబోధించి శాక్తేయ వి
ద్యాసక్తిన్ వివిధాస్త్రశస్త్రముల బీభత్సంబు కల్పింప స
ధ్యాసన్ దండము చాచి తత్కళను విధ్వంసంబు గావించి వి
శ్వాసం బీశ్వరశక్తిపై మలిపె మూసా ముక్తకంఠోక్తిచేన్.

You may also like...