ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 139| 14th September 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 139
వక్తలు :
- కుమారి చింతపల్లి అమృతవల్లి, ఇసుకపల్లి
- శ్రీమతి వేగేశ్న ఉమామాధవి, విశాఖపట్టణం
287 వ పద్యము
అల భగీరథుఁడు దివ్యాపగన్ విడిపించి
దివి నుండి నేలకు దింపినాఁడు
ఆ యగస్త్యుండు మహాజలరాశిని
చుక్కైన లేకుండ జుఱ్ఱినాఁడు
మనుసూరు నురిదీసినను చరాచరముచే
నీశ్వరుండనుచు పాడించినాఁడు
మొహిదీనుబాదుషా మహనీయుఁడార్షి మృ
త్యువును రావలదని త్రోసినాఁడు
ఇట్టు లధ్యాత్మవిదు లెందరెందరీ జ
గాన మాహాత్మ్యములఁ జూపఁగలిగినారు
వారివలె శక్తి గడియింపనేరనట్టి
వారి తపసేల వేదాంత వాదమేల.
288 వ పద్యము
మాటలు వేయి చెప్పినను మానసికంబగు శక్తి రానిదే
లాటి ప్రబోధమైన విఫలంబని యెల్ల మతప్రచారకుల్
చాటిరి యా మహామహిమలన్ గల యోగరహస్యముల్ జగ
న్నాటకరంగమం దవియె ధర్మము లిప్పటికైనఁ బేర్కొనన్.