ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 137| 31st August 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 137

వక్తలు :

  1. శ్రీ బళ్ళ వేంకట సుబ్బారావు, నరసాపురం
  2. శ్రీమతి కిలారి దీప్తి, హైదరాబాద్

283 వ పద్యము
దుష్టులు కొందఱీశ్వరుని త్రోవలు నేర్పుఁడటంచు వచ్చి సం
తుష్టులఁబోలె పై పయిని దోఁచిన గోతులు త్రవ్వుచుందురా
భ్రష్టులు పాపులై వ్యధల పాలయిపోదురు కుండ కొండలన్
నష్టము సేయఁబోయి యదె నష్టము జెందెడుమాడ్కి నారయన్.

284 వ పద్యము
కొందఱు తత్త్వవేత్తలని కోపము తాపము దుర్విదగ్ధస్వ
చ్ఛంద దురాగ్రహగ్రసిత చండపదంబున నుందురందులోఁ
గొందఱు మత్తు వస్తువులకున్ గయిచాచెద రిట్టి మోసగాం
డ్రందరు బ్రహ్మవేత్తలని యారయఁబోకుఁడు కీడు మూడెడున్.

You may also like...