ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 130| 13th July 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 130
వక్తలు :
- శ్రీ దొండపాటి వెంకట సుబ్బారావు, హైదరాబాద్
- శ్రీమతి రంధి జ్యోతి, గోకవరం
268 వ పద్యము
శ్రీకృష్ణుఁడే గొల్లచేడెలఁ గూడిన
గీతఁ బోలిన గీతి గీయలేఁడు
వ్యాసుఁడే విశ్వస్తదాసుఁడు నగునేని
బ్రహ్మసూత్రంబులు వ్రాయఁలేడు
అమరాధిపతి యహల్యాజారుఁడైన ని
లింపుల దివిని పాలింపలేఁడు
ఎలమి విశ్వామిత్ర ఋషి మేనకను గూడ
సృష్టికిఁ బ్రతిసృష్టి సలుపలేఁడు
తే.గీ. బొగ్గులెపుడు బంగారు కాఁబోవనట్లు
నీతిబాహ్యులు తత్త్వమున్ దెలుపలేరు;
అంధుఁ డాదిత్యు నెఱుఁగని యట్లు పాపి
యెఱుఁగలేఁడీశ్వరుని చదువెంతయున్న.
269 వ పద్యము
కృష్ణుండే వ్రజకామినీమణులకున్ గేల్మోడ్చువాఁడైనఁ భ్రా
జిష్ణున్ విష్ణుని రాజసూయమున నాజిన్ భీష్ముఁ డర్థించునా
తూష్ణింపన్ శిశుపాలుఁ డేమెఱుఁగఁడా దూషించఁడానాఁడు వ
ర్ధిష్ణున్ గృష్ణుని శత్రుకోటి యటు చిత్రించెన్ దురర్థంబులన్.