ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 129| 06th July 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 129
వక్తలు :
- శ్రీమతి సాగి జ్యోతి కుమారి, తాళ్లరేవు
- శ్రీ సకినాల వెంకటేశ్వర రావు, హైదరాబాద్
266 వ పద్యము
జ్ఞానపథంబు మిక్కిలి వికాసమునైనది పూతమైన యీ
స్థానము సద్గుణంబులకుఁ దావలమైనది దీనియందు నే
మానవుఁడైన ముక్తిపదమార్గము గాంచును గాన నీ యశో
గానము మూఁడులోకములఁ గంపిలసేయు తమస్సు మాయఁగన్.
267 వ పద్యము
నీతియు సద్గుణంబులను నేరనివారిని త్రాఁగుబోతులన్
గాతరులన్ దిగంబరులఁ గాంచినఁ గొందఱు బ్రహ్మవేత్తలం
చాతతపూజ్యభావమున నర్చన సేతురు పూర్వమార్ష సం
జాతము జేసెనే కలుషజాలము పాలను రక్తముండునే.