ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 125| 8th June 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 125
వక్తలు :
- శ్రీమతి కేశవరపు లక్ష్మీ, అచ్చంపేట
- కుమారి మండా ఉమా మహేశ్వరి, కాకినాడ
257 వ పద్యము
గాలై వీచుచు ధూళియై యెగురుచున్ గల్పాంత కాలానల
జ్వాలై భూతములేర్చుచున్ రజనికాధ్వాంతంబు బోకార్చి పా
తాళంబున్ దివియున్ జరాచరములున్ దర్కించి శూన్యంబుగా
నాలోకించుచు తానె యీశ్వరునిగా నర్థింత్రు యోగీశ్వరుల్.
258 వ పద్యము
చినుకులు ముత్యమైన నవి చేడ్పడి చిన్కులు గావు జీవుఁడున్
ఘనతర మీశ్వరాకృతిని గాంచిన జీవుఁడు గాఁడు; పుట్టుచున్
జనెడు జడత్వమున్ వదలఁజాలిన నింక పదార్థవాదసం
జనితములైన పోలికలు సాగ వతీంద్రియమైన రూఢికిన్.