ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 115| 30th March 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 115
వక్తలు :
- శ్రీమతి పటాని ఉమామహేశ్వరి, రాజపూడి
- శ్రీ వనపర్తి సత్యనారాయణ, రాజమండ్రి
237 వ పద్యము
మధువున్ మానినులున్ వనావళి నదీమార్గాల సౌధంబు లా
విధి స్వర్గాన రచించెనన్న నవి యీ విశ్వాన లేవే! వృథా
పృథుయజ్ఞాది తపస్సమాధులు తదావిర్భావమున్ బాపఁగా
కథలన్ జెప్పి మరల్చినారము మమున్ గారింపఁగాఁ బోకుడీ.
238 వ పద్యము
ఎప్పటికైన మేము జగదీశ్వరునిం గని స్వర్గసౌధముల్
చెప్పుల నెక్కిపోయి యట చిత్రము లారసి వచ్చి మీకడన్
జెప్పెడు నాస లేదు, ప్రహసించిన మ్రొక్కిన నాత్మశుద్ధిలో
దప్పులు లేవు నా తిరుగుఁదారి వచింపఁగరైరి యెవ్వరున్.