ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 113| 16th March 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 113

వక్తలు :

  1. శ్రీ గరిగిపాటి రాము, గుమ్ములూరు
  2. శ్రీమతి దిడ్డి శ్రేయ, మస్కట్

233 వ పద్యము
అన్నము మాని వత్సరములైన వసింపఁగవచ్చుగాని యే
తెన్నున నిద్రమాని విమతిన్ బ్రతుకంగలవారు లేరు ని
ర్భిన్నసమాధి నెప్డొ నిదురింపక తప్పదు వేల యేండ్లు నీ
కన్నులఁ జూడుమీ యిహముకన్న మరేమియు లేదు మోక్షమున్.

234 వ పద్యము
ఏదో యున్నది దాని తీరు మనకే యేతీరులన్ బట్టుకో
రాదే దాని రహస్యమిట్టి దని నిర్మానుష్యమైనట్టి యా
యాదిత్యేందు ఖగోళచక్రముల మృగ్యంబైన స్వర్గాది ప్రా
సాదంబుల్ కనపర్తు రేటికవి విశ్వస్థంబు వర్జించినన్.

You may also like...