ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 110| 24th February 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 110
వక్తలు :
- శ్రీ త్సవటపల్లి సాయి వెంకన్నబాబు, భీమవరం
- శ్రీమతి వనపర్తి మాధురి, విశాఖపట్టణం
227 వ పద్యము
మధువును ద్రావి త్రావి యల మైకమునందు విధూతవాక్సుధా
మధురములైన సత్కవితమార్గములన్ దలపోసి పోసి యా
పథికుఁడు సృష్టిలోపలి ప్రభావములన్ గనునట్లు నీవు నీ
పథమునఁ దత్త్వమున్ దెలిసి పాడుము నీ స్వకపోలగీతముల్.
228 వ పద్యము
ప్రార్థనఁ జేసి చేసి పడరాని శ్రమల్ పడి పొందుచున్న నీ
నిర్ధనమైన సంగతికి నేరని రీతికి వింత తోఁచు వా
గర్థముభంగి ప్రార్థన మహాఫలమియ్యనిదేని యేల నీ
స్వర్ధుని నమ్మ బోఁకు నిజసంగతి నేర్చితటంచు మూర్ఖతన్.