ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 106| 27th January 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 106
వక్తలు :

  1. శ్రీమతి బోడస కుర్తి ఉమా మహేశ్వరి, మల్లాం
  2. శ్రీమతి యర్రా అరుణ కుమారి, కాకినాడ

219 వ పద్యము
ఉ. ఆరసి పంచభూతములయందు లయంబయిపోయినట్టి ని
ష్ఠారతి దృక్ప్రపంచకము సంగతినే మొదలంట వీడి వి
స్ఫార మనోవికారములవంకను బోక యసంగుఁడై తమో
ధారణుఁడంచు నెంచు నిజతాత్త్వికుఁడే కను తన్ను నీశ్వరున్.

220 వ పద్యము
సీ. అణువులలో దూరి యాకాశమై మాఱి
చుక్కలలో తొంగి చూచుచుండు
పుష్పంబుగాఁ బూచి పుప్పొడియై లేచి
సౌరభంబులఁ దోగి సాగుచుండు
మేఘాల గర్జించి మెఱపులఁ బరతెంచి
మిన్నేరులను బాఱి మెఱయుచుండు
దీర్ఘికావళి గ్రాలి దిక్కుంభికుంభాల
నెక్కి నాట్యము చేసి యెసఁగుచుండు
తే.గీ. ఇట్టులొకటి యేమిటి యజాండాట్టహాస
భాసమానమహానందపదమునందు
బొదలి రోదసీ కుహరాల భోరుమనఁగ
కదిపివేయును జ్ఞాని విజ్ఞానకళను.

You may also like...