ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 101| 23rd December 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

వక్తలు :

  1. శ్రీ బుద్ధా అచ్యుత రామారావు గారు, గెద్దనాపల్లి
  2. శ్రీమతి సత్తిరాజు శ్రీలక్ష్మి జానకి క్రిష్ణ కుమారి, భీమవరం

209 వ పద్యము
ఈ సముపాసితంబయిన నీశ్వర తేజము భూమి నిండి కై
చేసి ప్రశంసపాత్రముగఁ జేరుచునున్నది స్వర్గమందిరా
వాసము దాఁక నా వెలుఁగు వాసన లెల్ల వెలార్చి జీవితా
భాసమునందు నేననెడు భావము సిద్ధము జేయుమెంతయున్.

210 వ పద్యము
ప్రాణము వంచి యింద్రియ పరంపరలన్ దిగజార్చి పూజలో
మేను కుదిర్చి దీక్షను నిమీలిత లోచనుఁడై సమాధి వి
జ్ఞానము గన్న యోగి తనకన్న మహత్తరమైనదేదియున్
గానఁడు తన్నె గాంచినుము కాంచనమైన తెఱంగు పూర్ణుఁడై.

You may also like...