Nagulapalli Upparugudem Jnana Sabha | 10 January 2025
Press note నాగులాపల్లి ఉప్పర గూడెం 10-1-25
సభలో ప్రసంగించిన బాల బాలికలను ఆధ్యాత్మిక రత్నాలుగా అభివర్ణించారు పీఠాధిపతి Dr Umar Alisha స్వామి. శుక్రవారం రాత్రి నాగులాపల్లి ఉప్పర గూడెం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆద్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సు ను ఉద్దేశించి పీఠాధిపతి Dr Umar Alisha స్వామి అనుగ్రహ భాషణ చేశారు. త్రయీ సాధన ను విశ్వ సాధన గా అభివర్ణించారు. ఈ త్రయీ సాధన ద్వారా భిన్నత్వం నుండి ఏకత్వం వైపు పయనింప చేసి , మానవత్వ పరిమళాలు వికసింప చేసి, సమైక్య జీవనం సాగిస్తు, సంతోషకరమైన జీవితాన్ని గడుప వచ్చు అని Dr Umar Alisha స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో 11మంది చిన్నారులు వైవిధ్యభరతమైన ప్రసంగాలు సభికులను అలరించాయి. పిల్లలకు చక్కటి శిక్షణ ఇచ్చిన గాది రాముడమ్మ ను స్వామి శాలువ కప్పి సత్కరించారు. మాస్టర్ నంద్యాల యశ్వంత్ చెప్పిన ప్రసంగం స్వామి వారి హృదయం లో స్థానం సంపాదించి, స్వామి యశ్వంత్ ను కూడా శాలువ కప్పి సత్కరించారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 12 మంది స్వామి వారిని శాలువ కప్పి, పుష్ప మాలాoకృతులను చేశారు. గ్రామం తరపున శ్రీ జక్కి వెంకట రెడ్డి, శ్రీ జక్కి శ్రీనివాసరావు, శ్రీ జక్కి వెంకట సోమరాజు గారి కుటుంబ సభ్యులు అంతా స్వామి వారిని ఘనంగా సన్మానించారు. వందలాది సభ్యులు ఈ సభలో వైకుంఠ ఏకాదశి పుణ్య కాలంలో స్వామి వారి ధర్సనం చేసుకుని పునీతులు అయ్యారు.
ఇట్లు
Peruri Suribabu,
కన్వీనర్,
98489 21799