యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లి లో 11-10-24 న సద్గురు పాదుక పూజా మహోత్సవం వైభవంగా నిర్వహించబడినది

ప్రెస్ నోట్ నాగులాపల్లి 11-10-24
ఆద్యాత్మిక తాత్విక మానసిక పుష్పాలను సద్గురువు పాదాలకు సమర్పించు కొనుట ద్వారా మానవ జీవితాన్ని అర్థవంతంగా తీర్చి దిద్దుకో వచ్చని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వాటిని పెంచి పెద్ద చేసి పోషించి, వాటి ఫల సాయం వచ్చేవరకు కూడా చిన్నపిల్లలాగా పరిరక్షించాలని అన్నారు. ఐదుగురు పీఠాధిపతులు వారి పాద ధూళితో నాగులపల్లి మరియు పరిసర గ్రామాలన్నీ సస్యశ్యామలం చేశారు. మానవత్వపు విలువలు ఆధ్యాత్మిక తాత్త్విక జ్ఞానము ద్వారా పెంపొందించారని అన్నారు. ఆధ్యాత్మిక సంపదను సద్గురువు ద్వారా పెంపొందింప చేసుకోవడం ద్వారా అభద్రతాభావం, అశాంతి, రక్తపాతం, హింస నివారించబడి శాంతి, తృప్తి, సుఖం, సంతోషం లభించునని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు.

శుక్రవారం రాత్రి యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సద్గురు పాదుక పూజా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారికి వెండి పాదుకలు చేయించి, పంచామృతాలతో అభిషేకం చేసి, స్వామి వారి పాదాలకు తొడిగి, వెండి పువ్వులు, గులాబీ రేకులతో వందలాది సభ్యులు సద్గురు పాదాలకు భక్తితో ఘనంగా పూజించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కన్వీనర్ లు శ్రీ పెనుమల్లు సుబ్బారావు, శ్రీమతి గుర్రాల గందాలమ్మ,శ్రీ చింతపల్లి నాగేశ్వరరావు, శ్రీ పద్దిరెడ్డి మాష్టారు, శ్రీమతి బిళ్ల కుర్తి సుబ్బ లక్ష్మి, శ్రీ చింతపల్లి మూలరెడ్డి గారి ఆధ్వర్యంలో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారికి శాలువ కప్పి, గులాబీ పూలదండ వేసి, ఫల పుష్పాలను సమర్పించి ఘనంగా సన్మానించారు. సద్గురు పాద పూజ విశిష్టత ను ప్రముఖ గీతావదాని శ్రీ యర్రoశెట్టి ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ గురుపాదపూజతో చతుర్విధ పురుషార్ధాలు సిద్ధిస్తాయని గురుపాద మహిమను వివరించారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు 11 మంది నిరుపేద వృద్ధులకు, దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు, ట్రస్ట్ కన్వీనర్ డా. పింగళి ఆనంద్ కుమార్, సెంట్రల్ కమిటీ మెంబర్ శ్రీమతి స్వర్ణలత, శ్రీ వి.వి.వి సత్యనారాయణ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.

ఇట్లు
పేరూరి సూరిబాబు, పీఠం కన్వీనర్


बच्चों के समान पौधों की देखभाल करने की जरूरत-डाॅ.उमर अली शाह

Jdnews Vision…

नागुलापल्ली : :श्री विश्व विज्ञान विद्या आध्यात्मिक पीठ के नौंवें पीठाधिपति  डाॅ.  उमर अली शाह ने कहा कि सभी को भगवान  समान पौधों का पालन-पोषण करना चाहिए और फल आने तक एक बच्चे की तरह उनकी देखभाल  करनी चाहिए और उनकी सुरक्षा करनी चाहिए।

यू कोतापल्ली मंडल के नागुलपल्ली ग्राम में अवस्थित  श्री विश्व विज्ञान विद्या आध्यात्मिक पीठ आश्रम परिसर में शुक्रवार की रात आयोजित सद्गुरु पादुका पूजन महोत्सव भव्यता के साथ आयोजित किया गया। इस अवसर पर आयोजित समारोह में उपस्थित शिष्यों को संबोधित करते हुए पीठाधिपति  डाॅ.  उमर अली शाह ने कहा कि पाँचों धर्मगुरुओं ने अपने पैरों की धूल से नागुलपल्ली और आसपास के गाँवों में हरियाली लाने का भरसक  प्रयास किया।  उन्होंने कहा कि आध्यात्मिक एवं दार्शनिक ज्ञान से मानवीय मूल्यों का विकास होता है।

पीठाधिपति  डाॅ.  उमर अली शाह ने कहा कि  सद्गुरु के माध्यम से आध्यात्मिक संपदा का विकास करने से असुरक्षा, अशांति, रक्तपात और हिंसा से बचा जा सकेगा और शांति, संतोष, सुख और खुशहाली प्राप्त होगी।

पीठाधिपति  डाॅ.  उमर अली शाह के  लिए चांदी के पादुकाएं बनवाई गई और उन्हें पंचामृत से अभिषेक किया और सैकड़ों सदस्यों ने भक्तिभाव से चांदी के फूलों और गुलाब की पंखुड़ियों से सद्गुरु के चरणों की पूजा की।

इस कार्यक्रम में पीठाधिपति डाॅ.  उमर अली शाह के निर्देशन में स्थानीय संयोजक पेनुमल्लू सुब्बाराव, श्रीमती गुरलाला गंडालम्मा, चिंतापल्ली नागेश्वर राव, पद्दिरेड्डी मास्टर, श्रीमती बिल्ला कुर्ती सुब्बा लक्ष्मी, श्री चिंतापल्ली मूलरेड्डी उपस्थित थे।  डाॅ.  उमर अली शाह ने उन्हें शॉल ओढ़ाकर, गुलाब की माला पहनाकर और फल  देकर सम्मानित किया।  प्रसिद्ध गीतकार वाई. उमा महेश्वर राव ने सद्गुरु पद पूजा की विशिष्टता बताई और गुरुपद की महिमा को समझाते हुए कहा कि गुरुपद पूजा सभी चारों पुरुषार्थों को पूरा करती है।  उमर अली शाह ग्रामीण विकास ट्रस्ट की  ओर  से अध्यक्ष डॉ. उमर अली शाह  ने 11 जरूरतमंद बुजुर्गों को कंबल व साड़ियां वितरित कीं।  इस कार्यक्रम में पीठ के संयोजक  पेरुरी सुरीबाबू, ट्रस्ट संयोजक डॉ. पिंगली आनंद कुमार, केंद्रीय समिति सदस्य श्रीमती स्वर्णलता,  वीवीवी सत्यनारायण मास्टर और अन्य ने भाग लिया।

You may also like...