శ్రీ మొహిద్దిన్ బాద్షా మెమోరియల్ హోమియోపతి హాస్పిటల్ ఆరవ శాఖ ప్రారంభించారు | 27 November 2024
ది. 27.11.2024 బుధవారం సాయంత్రం 6 గంటలకు **
ఆధ్యాత్మిక రాజధాని రాజమహేంద్రవరంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం శాఖ నందు శ్రీ మొహిద్దిన్ బాద్షా మెమోరియల్ హోమియోపతి హాస్పిటల్ ఆరవ శాఖను సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది.
డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న హోమియోపతి హాస్పిటల్స్ లో ఇది ఆరవ శాఖ. ప్రతివారం హోమియోపతిలో మాస్టర్ డిగ్రీ పొందిన డాక్టర్స్ వారానికి మూడు రోజులు తమ సేవలు వినియోగిస్తారని డాక్టర్ ఆనందకుమార్ చెప్పడం జరిగింది.
ఈ సందర్భంగా స్వామివారి రాకను పురస్కరించుకొని రాజమండ్రి శాఖ మరియు పరిసర గ్రామముల సభ్యులు వీధినంతా ఆవునేతి దీపాలతో అలంకరించి, పళ్ళాలలో ఆవునేతి దీపాలను ఉంచి స్వామి వారిని ఘనంగా స్వాగతించడం జరిగింది. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో పీఠం తాలూకు కమిటీ సభ్యులు పుర ప్రజలు పాల్గొని కార్యక్రమమును జయప్రదం చేయడం జరిగినది. ప్రార్థన అనంతరం రాజమండ్రి శాఖ కన్వీనర్ కృష్ణంరాజు గారు మాట్లాడుతూ కార్తీకమాస విశిష్టత, గురువు యొక్క ఆవశ్యకత చెప్పడం జరిగింది.
అనంతరం స్వామి వారు సభ్యులను ఉద్దేశించి వారి అనుగ్రహ భాషణ చేస్తూ… ధూప దీప నైవేద్యముల గురించి చెబుతూ వారికి గురుదక్షిణగా సభ్యులంతా మూడు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడవలసిందిగా పిలుపునివ్వడము జరిగినది. అందరూ స్వామివారిని దర్శించుకొని ఆనంద పరవశులై తమ తమ నెలవులకు పైనమైరి.
ఇట్లు
D. కృష్ణంరాజు.
రాజమహేంద్రవరం శాఖ