95th Annual Congregation | MahaSabhalu – 10th Feb 2023 – Day 2
10th Feb 2023 – MahaSabha Day 2 – 10-ఫిబ్రవరి -2023 వార్షిక మహాసభ – రెండవ రోజు
PRESS NOTE
Dt. 10. 2. 2023,
PITHAPURAM.
ఆధ్యాత్మిక తత్వం మనసుకు దశ దిశ నిర్దేశిస్తుంది
…….పీఠాధిపతి – డాక్టర్ ఉమర్ ఆలీషా
ఆధ్యాత్మిక తత్వం మనసుకు దశ దిశ నిర్దేశిస్తుందని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 95వ వార్షిక జ్ఞాన మహాసభల్లో భాగంగా రెండవరోజు శుక్రవారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో ఆలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేసారు.
మానవునిలో మంచి చెడులను ప్రేరే పించేది మనసు అని అన్నారు. మనసులో భావాలను బట్టి మనిషి మనుగడ ఉంటుందని ఆలీషా తెలిపారు. మనసుద్వారా మంచి, చెడు గుణ గణాల శక్తి మానవుడిపై ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు. మానవుడు రాక్షసత్వం వీడి ఈశ్వరత్వం వైపు పయనించాలంటే ఆధ్యాత్మిక తాత్వాన్ని గ్రహించాలని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక తత్వం, తాత్విక జ్ఞానంతో పొందే తాత్విక శక్తితో మనసును మంచి మార్గంవైపు మరల్చుకోవచ్చునని అన్నారు. అరిషడ్వర్గాలను స్థాయిపర చుకుంటే అది సాధ్యమౌతుందని తెలి పారు. పీఠం అందిస్తున్న ధ్యాన, జ్ఞాన, మంత్ర, సాధనలతో కూడిన త్రయి సాధన అవలంబించడం ద్వారా మనసులో ఉద్భవించే చెడు భావనలు నియంత్రించ బడతాయని అన్నారు.
తదుపరి సభకు విచ్చేసిన ముఖ్య అతి ధులు వివిధ మతాలకు చెందిన ప్రతిని ధులతో చేతులు కలిపి మత సామర స్యానికి, సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆలీషా పిలుపు నిచ్చారు
అనంతరం పీఠం రూపొందించిన వివిధ కరపత్రాలను, మరియు ఆధ్యాత్మిక గ్రంధాలను అతిధుల సమక్షంలో సభలో ఆవిష్కరించారు
సభకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన మాజీ హోం శాఖ మంత్రి, ఉపముఖ్య మంత్రి, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన రాజప్ప, మరియు కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు మాట్లాడుతూ ఆధ్యాత్మిక తత్వ ప్రబోధం ద్వారా ప్రతివ్యక్తిలోనూ మానవత్వపు విలువలను పెంపొందించడానికి నిరంతరం పాటుపడు పడుతున్న పీఠాన్ని సందర్శించడం తమకెంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పీఠం అందిస్తున్న సేవలను ప్రశంసించారు.
అనంతరం మదర్ ఇండియా ఇంటర్నే షనల్ మరియు తూర్పుగోదావరి జిల్లా వినియోగదారుల రక్షణ సమితి సభ్యులు పీఠాధిపతి ఉమర్ అలీషాను ” విశ్వజ్ఞాన సరస్వతి ” అవార్డుతో సత్కరించారు.
సభలో పాల్గొన్న పీఠం ఎన్. ఆర్. ఐ. సభ్యులు పేరూరి విజయరామ సుబ్బా రావు, అడబాల వెంకీ, నూతక్కి భరత్ మరియు పీఠం సభ్యులు అబ్బిరెడ్డి అనూష, బి. హర్షిణి, డాక్టర్ పద్మావతి, ఎ. వి. వి. సత్యనారా యణ, శివరామ కృష్ణ, అమీర్ భాషా, గోసుల రమణలు మాట్లాడుతూ 84 లక్షల జడజన్మల అనంతరం ఉత్కృష్టమైన జన్మను పొందిన మానవుడు జన్మ సార్థకత కొరకు ముక్తిని పొంది తరించా లంటే ఇంద్రియాలకు అతీతంగా ఉండే తాత్విక విషయాలను గ్రహించాలని అన్నారు. అటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన ఔషధాన్ని పొందాలంటే సద్గురువు ను ఆశ్రయించాలని పేర్కొన్నారు. సామా న్యులను సైతం అసామాన్యులను చేసే మహోన్నత పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని వెల్లడించారు.
ఈ సందర్భంగా జె.ఎన్. టి.యు. కె, వైస్ ఛాన్సలర్ జి. వి. ఆర్. ప్రసాద రాజు, న్యాయమూర్తి చెరుకూరి రఘుపతి వసంత కుమార్, రెవరెండ్ డాక్టర్ విలియమ్స్, పిఠాపురం సీఐ, వై.ఆర్.కె. శ్రీనివాస్, రాజీవ్ గాంధీ లా కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, యోగరత్న జ్యోతుల నాగేశ్వరరావు, తోట రాంజీ, భవానీ పీఠం పీఠాధిపతి శివరామకృష్ణ పంచాంగ కర్త బాణాల దుర్గా ప్రసాదా చార్యులు,తదితరులు పీఠాధిపతిని దర్శించుకున్నారు.
సభలో నిర్వహించిన సంగీతవిభావరిలో ఎ.ఉమ ఆలపించిన కీర్తనలు సభికులను రంజింపచేసాయి. సభలో పాల్గొనడానికి దేశ, విదేశాలనుండి విచ్చేసిన సభ్యులకు ఆశ్రమం వద్ద ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా 225 మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు.
ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ తదితరులు పాల్గొన్నారు.
Cultural programs | సాంస్కృతిక కార్యక్రమాలు
రెండవ రోజు – సాంస్కృతిక కార్యక్రమాలు
రెండవ రోజు – యువ చైతన్య వికాస్
News
News Paper