Kavisekhara Dr. Umar Alisha 139th Birthday Celebrations at Tadepalligudem | 28th February 2024

ది. 28-2-2024 తేదీ బుధవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం ఆశ్రమ శాఖ భవనమునoదు షష్ఠ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 139వ జయంత్యోత్సవ సభ జరిగినది.
సభ యొక్క విశిష్ఠతను ఉభయ జిల్లాల కో-ఆర్డినేటర్
A. N. వెంకటరత్నం తెలియచేసి, సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించగా
సభనందు పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు Dr. పింగళి ఆనందకుమార్, పీఠం సభ్యులు శ్రీ గోపిశెట్టి రాంప్రసాద్, శ్రీ పెనుమల్లు వెంకట రామారెడ్డి, శ్రీ గోపరాజు సాయి రవికుమార్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీ ఇర్రి నాగ సూర్య ప్రసాద్, శ్రీ మందపాటి లక్ష్మణ వర్మ గార్లు 6వ పీఠాధిపతి గారు రచించిన గ్రంధాలలోని అనేక అంశాలపైన, మరియు వారు కవిగా, ఆధ్యాత్మిక పీఠ తత్వవేత్తగా, సామాజికవేత్తగా అనేక కోణాలలో మానవాళికి ప్రసాదించిన ప్రగతిని వివరించారు.
గోపరాజు అనురాధ గారు పద్యం చదివి, దాని భావాన్ని సభికులకు అర్ధమయ్యే రీతిలో చక్కగా వివరించారు.
షష్ఠ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 139వ జయంతి సందర్భముగా కేకు కట్ చేసి, ప్రసాదాన్ని తాడేపల్లిగూడెం ఆశ్రమ నిర్వాహకులు సభ్యులకు పంపిణీ చేశారు.
Dr. P. ఆనందకుమార్ గారిని, PV రామారెడ్డి గారిని, గోపిశెట్టి రాంప్రసాద్ గారిని ప౹౹గో౹౹ జిల్లా కమిటీ సభ్యులు, ఆశ్రమ శాఖ, ఆరాధనా కమిటీల సభ్యులు కలసి దుస్సాలువాలతో సత్కరించారు.
హారతి అనంతరం సభ్యులకు ప్రసాద వితరణ చేశారు.
ఇట్లు,
తాడేపల్లిగూడెం ఆశ్రమశాఖ కమిటీ, ఆరాధనా కమిటీ, మరియు
జిల్లా కమిటీ సభ్యులు.

You may also like...