Kavisekhara Dr. Umar Alisha 139th Birthday Celebrations at Boat Club, Kakinada | 28th February 2024
ఉమర్ ఆలీషా రచనల్లో స్త్రీ జనాభ్యుదయం పరిఢవిల్లినది అని DPRO శ్రీ నాగార్జున అన్నారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి 139 వ జయంతి సభ కు ప్రస్తుత పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి సోదరుడు అహ్మద్ అలీషా అధ్యక్షత వహించగా,DPRO నాగార్జున ముఖ్య అతిధి గాను, ప్రస్తుత పీఠాధిపతి మరొక సోదరుడు శ్రీ హుస్సేన్ షా, కవి శిరీష, రిటైర్డ్ టీచర్ శ్రీ kvss ప్రసాద్, అతిథులుగా వేదిక నలంకరించి ప్రసంగించారు.సభాధ్యక్షులు అహ్మద్ ఆలీషా మాట్లాడుతూ కవి శేఖర డా. ఉమర్ ఆలిషా గారు స్వాతంత్ర్య సమర యోధుడు గా, ప్రజా ప్రతినిధి గా, పార్లమెంట్ మెంబర్ గా, అభ్యుదయ రచయిత గా, ప్రగతి నిర్దేశకునిగా, మహోన్నత వక్త గా, మానవతావాద ప్రవక్తగా కీర్తి గడించారు అని అన్నారు. శ్రీ kvss ప్రసాద్ మాట్లాడుతూ ఆయన ప్రతీ రచనా ఏదో ఒక సామాజిక ప్రయోజనాన్ని ప్రసాదించేదే అని అన్నారు. వారు సుమారు 50 గ్రంధాలు రచించారు అని అన్నారు. శ్రీ హుస్సేన్ షా మాట్లాడుతూ ఆనాటి సమాజంలో స్త్రీ విద్యపై ఎన్నో ఆంక్షలు ఉండేవి. వారి రచనల్లో స్త్రీ విద్యను వ్యతిరేకించే వారి పట్ల వారు వారి రచనల్లో చాలా తీవ్ర పదాలు ఉపయోగించేవారు. శ్రీ AVV సత్యనారాయణ మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి డా. ఉమర్ ఆలీషా అని, వారు భారత దేశం అంతటా పర్యటించి పలు పండిత సభల్లో పాల్గొని సాహిత్య ,ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చి, అద్భుత ప్రతిభను ప్రదర్శించి పలు సన్మానాలు, సత్కారాలు, బిరుదులను పొందారు. శ్రీ పేరూరి సూరిబాబు మాట్లాడుతూ 552 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి షష్ట పీఠాధిపతి గా కుల, మత, దనిక, పేద, స్త్రీ, పురుష భేదాలు లేకుండా జ్ఞాన ప్రబోధ చేసే వారని, వారి రచనల్లో ఖండ కావ్యాలు గ్రంధం నుండి 10 వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఒక పాఠ్యాంశం గా ప్రవేశ పెట్టారని, అనేక విశ్వ విద్యాలయాలలో వారి రచనలపై ఎందరో పరిశోధనలు చేస్తున్నారని, వారి సాహిత్యం పై అనేక పరిశోధనా వ్యాసాలు వ్రాయడం జరిగిందని అన్నారు. పీఠాధిపతి ఉమర్ ఆలీషా స్వామి వారి అజ్ఞ మేరకు పక్షులకు ఆహారంగా కార్యకర్తలకు ధాన్యపు కుచ్చులను పంపిణీ చేశారు. అహ్మద్ ఆలిషా గారు కేక్ కట్ చేసి అతిథులకు కార్యకర్తలకు పంపిణీ చేశారు. సభలో ముందుగా అహ్మద్ అలీషా జ్యోతి ప్రజ్వలన, ప్రార్థన చేసిన అనంతరం కవి శేఖర డా. ఉమర్ ఆలిషా గారి విగ్రహానికి సభాద్యక్షులు అతిథులు పుష్ప మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ రోజు టైలర్స్ డే సందర్భంగా పీఠాధిపతులకు బట్టలు కుట్టే దర్జీలు విజేత టైలర్ శ్రీ మలకల సత్యనారాయణ, శ్రీ అనిశెట్టి సోమారెడ్డి గార్లను ఆలీషా గారు సన్మానించారు. సైన్స్ డే సందర్భంగా ఉమర్ ఆలీషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీ హుస్సేన్ షా గార్ని సన్మానించారు.ఈ కార్యక్రమంలో శ్రీమతి కాకినాడ లక్ష్మి, శ్రీమతి రెడ్డి సూర్య ప్రభావతి,ఇ క్బాల్ అహమ్మద్ పాషా, ఖలీల్ షా, తదితరులు పాల్గొన్నారు.హారతి తో సభ ముగిసింది .
ఇట్లు,
పేరూరి సూరిబాబు,
పీఠం కన్వీనర్,
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, కాకినాడ శాఖ,
9848921799.