27 నవంబర్ 2023 – పన్నెండవ రోజు కార్తీక పౌర్ణమి సభ
27 నవంబర్ 2023 – పన్నెండవ రోజు కార్తీక పౌర్ణమి సభ
PRESS NOTE Dt. 27-11-2023, PITHAPURAM.
ఆధ్యాత్మిక సంపదతో మానవ జీవితం పరిపూర్ణమౌతుంది పీఠాధిపతి డా॥ ఉమర్ ఆలీషా మానవుడు తన జీవితంలో ఆర్జించే ధన సంపద, కీర్తి సంపదలకంటే ఆధ్యాత్మిక సంపదను పొందగలిగితే అతని జీవితం పరిపూర్ణమౌతుందని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డా॥ ఉమర్ ఆలీషా అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం పిఠాపురం కాకినాడ రోడ్డు నందలి పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఆలీషా ప్రసంగించారు. ఆధ్యాత్మిక విలువలు లోపించడంవలన మానసిక ప్రశాంతతను కోల్పోతున్న మానవుడు నిత్యం అలజడులకు లోనవుతూ అనేక హింసాత్మాక చర్యలకు పాల్పడుతు న్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.. ఆధ్యాత్మికత లోపిస్తే మానవుడు అధోగతి పాలవుతాడని ఆలీషా అన్నారు. ఆధ్యా త్మిక, తాత్విక జ్ఞానాన్ని పెంపొందించు కోవడం వలన మనసును స్థాయి పరు చుకునే స్థితి ఏర్పడుతుందని తెలిపారు. ధనాన్ని వెచ్చించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందలేమని, గురు ముఖంగా ఆధ్యాత్మిక తాత్వాన్ని పెంపొందించుకోవాలని వెల్ల డించారు. ప్రతిఒక్కరూ బాల్య దశనుండే ఆధ్యాత్మిక, తాత్విక విలువలను చిన్నారుల్లో పెంపొందించాలని పేర్కొన్నారు. తమ పీఠం నిర్వహిస్తున్న తాత్విక బాల వికాస్ కార్యక్రమం ద్వారా చిన్నారులకు తాత్విక విజ్ఞానాన్ని ప్రబోధిస్తున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక భావనల వలన ప్రకృతిని పరిరక్షించు కోవచ్చునని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సభ్యులకు సూచించారు. వృక్షో రక్షతి రక్షితః అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని పాటించాలని పేర్కొ న్నారు. పీఠం నిర్వహిస్తున్న ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నా మొక్క నా శ్వాస అనే పేరుతో గత 15 సంవత్సరాలుగా లక్షలాది మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తున్నామని తెలి పారు. అనంతరం సభకు విచ్చేసిన గౌరవ అతిధులు జాయింట్ కలెక్టర్ స్వర్ణ లత, కాకినాడ ట్రాఫిక్ డిఎస్పీ వెంకటేశ్వ రరావు విశ్రాంత ఉపాధ్యాయుడు కె వి ఎస్ ఎస్ ప్రసాద్ లు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి గురు భోధనలను గ్రహిస్తూ మానవత్వపు విలువలను పెంపొందించుకోవాలని తెలిపారు. గురువు యొక్క గొప్పదనాన్ని, కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతను సభకు వివరించారు అనంతరం ఉమర్ ఆలీషా రూరల్ డెవ లప్మెంట్ ట్రస్ట్ తరపున నిరుపేదలకు కుట్టుమిషన్లు, వినికిడి యంత్రాలు, మరియు పక్షుల ఆహరం కొరకు ధాన్యపు కుచ్చులను గౌరవ అతిధుల సమక్షంలో పీఠాధిపతి సభలో పంపిణీ చేసారు. పీఠం నిర్వహిస్తున్న తాత్విక బాలవికాస్ నందు శిక్షణ పొందుతున్న చిన్నారులు రేఖా ఉషా కిరణ్, అభినవ్ చంద్రక్, ఇర్రి జ్యోతి, గొంతెన జ్యోతి మరియు పీఠం సభ్యులు అమృతవల్లి,రంధి జ్యోతి, ఆధ్యాత్మిక ప్రసంగాలు సభికులను ఆక ట్టుకున్నాయి. సభలో పీఠం సభ్యురాలు అనిశెట్టి ఉమ పర్యవేక్షణలో నిర్వహించిన సంగీత విభావరి సభికులను రంజింప చేసింది. సభలో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూ లల నుండి విచ్చేసిన వేలాది మంది భక్తులకు పీఠం వద్ద భోజన సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా 180 మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ, ఎన్.టి.వి. ప్రసాదవర్మ తదితరులు పాల్గొన్నారు.