డాక్టర్ ఉమర్ అలీషా సాహితి సమితి – వ్యాస రచన పోటీ – చివరి తేదీ 20 డిసెంబర్ 2024

డా॥ఉమర్ ఆలీషా సాహితీ సమితి రిజిష్టర్డు నెం.171/95

19-22-6 బ్యాంకు కాలనీ, భీమవరం

డా॥ఉమర్ ఆలీషా “బర్హిణీదేవి” అనే చారిత్రక రూపమైన కావ్యాన్ని మత సామరస్యం, సహగమన నిషేధం ప్రధానాంశాలుగా రచించారు. ది. 23 జనవరి 2025 భీమవరంలో జరుపబడు కవిశేఖర డా॥ఉమర్ ఆలీషా 80వ వర్ధంతి సందర్భమును పురస్కరించుకొని “బర్హిణీదేవి” కావ్యంలోని పాత్రల స్వభావము చిత్రీకరించుటలో ఆలీషా కవి గొప్పతనం అనే అంశంపై వ్యాసరచన పోటీ ఏర్పాటు చేయబడినది. వ్యాసము రెండు అరఠావులకు మించకుండా వ్రాసి ది.20-12-24 లోపు ఈ క్రింది చిరునామాకు పంపవలెను. ఈ పోటీలో పాల్గొనుటకు వయస్సుతో సంబంధము లేదు. (అందరూ అర్హులే) మాకు చేరిన వ్యాసములలో ఉత్తమమైన వాటిని ప్రథమ, ద్వితీయ, తృతీయములుగా నిర్ణయించి ఫలితము ‘జనవరి 2025) తత్వజ్ఞానము మాసపత్రికలో ప్రకటింపబడును. విజేతలకు సాహితీ సభలో డా॥ఉమర్ ఆలీషా (నవమపీఠాధిపతి) సద్గురువర్యులచే జ్ఞాపికలు బహుకరించబడును. పోటీలో పాల్గొన్న మిగిలిన వారందరికీ యోగ్యతా పత్రములు పోస్టులో పంపబడును. పోటీలో పాల్గొను వారందరూ వారి వారి చిరునామా వివరముగా వ్రాయవలెను.

వ్యాసములు పంపవలసిన చిరునామా మరియు గ్రంథమండలి పుస్తకములు లభ్యమగు చిరునామా

డా॥ఉమర్ ఆలీషా సాహితీ సమితి

రిజిష్టర్డు నెం. 171/95, డోర్నెం. 19-22-6, బ్యాంకు కాలనీ, భీమవరం – 534 201. పశ్చిమగోదావరి జిల్లా

You may also like...