Bavuruvaka Sabha conducted on 03rd January 2023

ప్రెస్ నోట్
మనం బాగుండాలి మన గ్రామం బాగుండాలి, మన భవురువాకను బంగారువాక గా తీర్చి దిద్దు కుందాం అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహభాషణ చేశారు. 3-1-23 మంగళవారం ఉదయం ప్రత్తిపాడు మండలం భవురువాక గ్రామం లో అష్టమ పీఠాధిపతి శ్రీ మొహిద్దిన్ బాద్షా సద్గురువుల జకీర్ మందిరం వద్ద, అజీమా జహరమ్మ సేవా సంస్థ ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలు మరియు జ్ఞాన చైతన్య సదస్సు కు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ప్రస్తుత పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా స్వామి అధ్యక్షత వహించగా, వారి సోదరులు అహ్మద్ ఆలీషా, హుస్సేన్ షా, మేనమామ మస్తాన్ పాషా గారు వేదిక పై అశీనులయ్యారు. డా ఉమర్ ఆలీషా స్వామి వారు మాట్లాడుతూ “మనం బాగుండాలి మన భవురువాక బాగుండాలి, మన భవురువాకను బంగారువాక గా మార్చుదామని అన్నారు. 50 సంవత్సరాల క్రితం వారి తండ్రి గారైన అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా నడయాడిన పవిత్ర ప్రదేశమని అన్నారు. ఆ కాలంలో బవురువాక గ్రామస్తులు దాహార్తితో బాధ పడే వారు , వారి బాధను తొలగించుటకు వారు నుయ్యి తవ్వించారు అని అది పరమ పవిత్రమైన జలంగా మారి, దాహార్తిని తీర్చుటయే కాక, మలేరియా జ్వరాల నుండి ఉపశమనం కల్గాడానికి మందులు కూడా ఇచ్చి ఆరోగ్యాన్ని చేకూర్చారని, గ్రామ సభ్యుల అనుభవాల ద్వారా తెలియ బడు చున్నది అని అన్నారు. ఈ పరమ పవిత్రమైన ప్రదేశాన్ని రెండవ కాశీగా తీర్చి దిద్దుతామని, ప్రకృతి అందాలతో కూడిన ఈ కొండ వాలు ప్రాంతం , భవిష్యత్ లో,రెండవ కాశ్మీర్ గా విలసిల్లుతుందని అన్నారు.ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కల్పించుట కొరకు భవిష్యత్ లో ధ్యాన మందిరాన్ని నిర్మిస్తామని అన్నారు. ధ్యాన మందిరం లో ధ్యానం చేసుకొనుట ద్వారా అభౌతిక ఈశ్వర శక్తి లభించి ఇక్కడి ప్రజలు, సుఖ సంతోషాల తో, తృప్తిగా జీవిస్తారని అన్నారు. ధ్యాన మందిరం ద్వారా మనో కాలుష్యాన్ని నిర్మూలించుకోవచ్చు అని అన్నారు.
అజీమా జహరమ్మ సేవా సంస్థ ద్వారా గ్రామ నిరుపేదలకు 72 దుప్పట్లు పంపిణీ చేశారు. ఒక అందురాలు శ్రీమతి తలుపులమ్మ పాడిన కీర్తనకు అభినందిస్తూ ఉమర్ ఆలీషా గారు వారి సోదరులు శాలువా తో సత్కరించారు.మరియు దుప్పటి కూడా అందచేశారు. అహ్మద్ ఆలీషా గారు మాట్లాడుతూ కృషి ద్వారా ఋషి గా మారిన మహోన్నత మానవతా మూర్తి మా తండ్రి గారు మొహిద్దిన్ బాద్షా గారు అని శ్లాఘించారు.50 సంవత్సరాల క్రితం, గ్రామస్తులకు అన్నదానం చేసి, ఆకలి తీర్చారని, నుయ్య తవ్వించి దాహార్తిని తీర్చారని అన్నారు. మరొక సోదరుడు శ్రీ హుస్సేన్ షా గారు మాట్లాడుతూ జ్ఞాన చైతన్యం ద్వారా మానవతా విలువలు గ్రామం లో నెలకొల్పారు అని అన్నారు. గ్రామ సర్పంచ్ శ్రీ దొడ్డి సత్తిబాబు, మాజీ సర్పంచ్ శ్రీ జలుమూరు అప్పారావు, శ్రీమతి దంతులూరి సీతయ్య గారు వారి మహిమల గురించి సభ కు వివరించారు. హారతి తో సభ ముగిసింది.కార్య క్రమాన్ని శ్రీ NTV ప్రసాద వర్మ నిర్వహించగా, భవురువాక సభ్యులు పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా గార్ని గ్రామం తరపున శాలువా కప్పి సత్కరించారు.పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు, దాట్ల సీతారామ రాజు, శ్రీ దాట్ల కృష్ణం రాజు, వందల సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.
ఇట్లు
పెరూరి సూరిబాబు,
కన్వీనర్.

News Clippings

You may also like...