ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 161| 15th February 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 161

వక్తలు :

  1. శ్రీ నల్లపురాజు శ్రీనివాసరాజు, కువైట్
  2. శ్రీమతి ప్రగడ సుబ్బలక్ష్మి, బల్లిపాడు

331 వ పద్యము
ఉ. ఏది జితేంద్రియత్వ మది యేది యథార్థము జ్ఞానతత్త్వ సం
పాదనయందు త్యాగముపవాసము శీలము నైతికంబు మ
ర్యాద పరోపకారమ నహంకృత సాత్వికసిద్ధి వీనిలో
నేది కొఱంతయున్న మఱి యే గతివచ్చు మహాత్మ్యసంపదల్

332 వ పద్యము
శా. ఏదైనన్ భగవంతుఁడుండి కరుణాభీష్టాప్తి కాపాడు నాఁ
డౌదార్యంబును మోదమున్ విజయమున్ యోగించు లేదేని నిః
ఖేదంబైన పథంబు మానవులకున్ గ్లిష్టంబు విజ్ఞాన ది
వ్యాదర్శంబులు వేఱు పోల్చఁదగ దధ్యాత్మ్యంబుతో లోకమున్

You may also like...