1-Jan-2025 నూతన సంవత్సర మహాసభ

జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకొనే మహోన్నత మానవతా దేవాలయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామివారు అనుగ్రహ భాషణ చేశారు. 1-1-25 బుధవారం ఉదయం ప్రధాన ఆశ్రమంలో స్వామి వారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆంగ్ల నూతన సంవత్సర మహాసభను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మిక తాత్విక ఔషధం మానసిక వ్యవస్థను నియంత్రించి, నిరాశ, నిస్పృహకు లోను కాకుండా, మానవ జీవన తత్వం సవ్య దశలో మనుగడ సాగించే అవకాశం ప్రసాదిస్తుంది అని అన్నారు. మానవ కల్యాణం కొరకు ఉపయోగపడే తత్వాన్ని చిన్నారుల కోసం తాత్విక బాలవికాస్, యువత కోసం తాత్విక యువవికాస్ రూపంలో నిర్వహిస్తున్నామని అన్నారు. మానవాళిలో ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞాన జ్యోతులను ప్రజ్వలింప చేసి, విశ్వ మానవ శాంతి కోసం, ప్రతీ ఒక్కరిలో మానవత్వపు విలువలు వికసింప చేస్తున్నామని అన్నారు. తాత్విక బాలవికాస్ విద్యార్థులు అభినవ చంద్రక్, లిఖిలా ఉమామహేశ్వరి, అమరనాథరెడ్డి, సంహిత, ఉర్విషా ప్రసంగాలు సభికులను అలరించాయి. ప్రొఫెసర్ జయ శంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా. ఎన్. రామ గోపాల వర్మ డ్రోన్ పైలట్ శిక్షణ పై అవగాహన సదస్సు నిర్వహించి, యువత ఉపాధి అవకాశాలు సభకు వివరించారు. సెంట్రల్ కమిటీ సభ్యులు శ్రీ ఎన్.టి.వి. ప్రసాద వర్మ, పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు పీఠం విశ్వ వ్యాప్తికి సభ్యుల 72 విభాగాల్లో సేవా సహకారం కోరారు. శ్రీ ప్రసాద వర్మగారు సంగీత స్వర నిధి శ్రీ యేడిద సుబ్రహ్మణ్యం గారు పీఠానికి చేసిన సంగీత సేవలు సభకు వివరించారు. 2025 నూతన సంవత్సర సభలో పోకెట్ క్యాలెండర్స్, డైరీలను, వాల్ క్యాలెండర్స్ను స్వామి ఆవిష్కరించి ప్రతులను బహుకరించారు. తాత్విక బాలవికాస్ విద్యార్థులు అభినవ్ చంద్రక్, ఉర్విశా, సంహితలను స్వామి సత్కరించి అభినందించారు.

2025 సంవత్సరానికి సంగీత స్వర నిధి శ్రీ యేడిద సుబ్రహ్మణ్యం స్మారక సంగీత శిరోమణి అవార్డును, నూతన సంవత్సర సభ లో ఇద్దరు ప్రముఖ సంగీత సేవకులు శ్రీ M ముకుంద ప్రవీణ్, శ్రీమతి ఉమా ముకుంద దంపతులకు Rs 25000 కాష్ ప్రైజ్ , ప్రశంశ పత్రములు, momentous, బహూకరిoచి ఘనoగా సత్కరించి , శ్రీ ఏడిద సుబ్రహ్మణ్యం గారి సంగీత వారసులుగా ప్రకటించగా,పీఠం అస్థాన సంగీత విద్వాంసులుగా వీరిరువురూ బాధ్యతలు స్వీకరించడం జరిగింది.
శ్రీ ముకుంద ప్రవీణ్ శ్రీమతి ఉమా ముకుంద దంపతులు సన్మానం అనంతరం ప్రతిస్పందించారు.

You may also like...