ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 154| 28th December 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 154
వక్తలు :
- శ్రీమతి పటాని ఉమామహేశ్వరి, రాజపూడి
- శ్రీ యిర్రి రామకృష్ణ, అత్తిలి
317 వ పద్యము
ఉ. శాస్త్రము పారిభాషిక ప్రశస్త పదంబులచేత జ్ఞాన సం
భస్త్రిని నూదుచున్నది ప్రభాభరితంబగు దీనిలో రసా
విస్త్రకమైన నాదపరివిశ్రుతమందు మనంబుఁ జేర్చి తే
జస్త్రితయంబులైన రభసంబుల ముక్తిని గోలుపోదువే?
318 వ పద్యము
చ. వనితల దృక్కులే యురులు వాక్కు విషంబు కరంబు ముంగురుల్
ఘనతర కాలపాశములు గాఁగను యోగికి వారియందుఁ బ్రే
మను వెలిఁబుచ్చు లంపటుల మధ్య నిమేషము చోటులేదు యె
వ్వనిది నిజంబొ యెవ్వని దబద్ధమొ చెప్పఁగలేము నేరుగన్