ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 145| 26th October 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 145

వక్తలు :

1.శ్రీమతి బుద్ధరాజు రాధామాధవీ లత, భీమవరం
2.Dr. అక్కపోలు సాయి లిఖిత, హైదరాబాద్

299 వ పద్యము
పగలంత యేదొ యుపాధికై శ్రమపడి
మాపులు పోయి గ్రామాల వెంట
ఏది వారు నిజంబుగాఁ దలపోసి య
నుష్ఠాన మొనరించి నుడువుచుందు
రట్టి విజ్ఞానంబు నాదర్శముగఁ జేసి
యెలుగెత్తి ప్రజకు బోధింపుచుండి
రపుడు వారొనరించు నాత్మసమర్పణ
మధ్యాత్మశక్తిని యరసి యరసి

వేనవేలుగ ప్రజదీక్షఁ బూనుచుండి
రది స్వరాజ్యంబుకంటెను నధిక మనుచు
వరద వచ్చిన నేటికైవడి దిగంత
ములకు వ్యాపించె నామతములు జగాన.

300 వ పద్యము
శలభము దీపమందుఁ బడి జచ్చెడు కైవడి నీశ్వరాకృతిన్
విలయమునొంద సేయును వివేకి మలీమసకర్మ టోలముల్
తెలియనివారు భక్తులని తెల్పుచు నీల్గుచు కోళ్ళ లీల కూ
తలు నిడుచుందు రందు బలిదానము త్యాగము ప్రేమ యున్నదే.

You may also like...