ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 121| 11th May 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 121
వక్తలు :
- శ్రీ వనపర్తి శ్రీనివాస్, విశాఖపట్నం
- శ్రీ అడబాల వెంకటేశ్వర రావు (వెంకీ), అమెరికా
249 వ పద్యము
మేము పరిత్యజించితిమి మేలును కీడు సుఖంబు దుఃఖమున్
సామము లేదు సత్యము ప్రశాంతమహావిభవంబు లేదు వి
ద్యామధుపానమత్త మతియై విహరించుచు మేఘపంక్తి సౌ
దామినిబోలె చీఁకటుల దాఁటి తమస్సుల నిద్ర లేపుచున్.
250 వ పద్యము
హృదయద్వారము విప్పి తోచినది యేదే కాని నిష్కర్షగా
నెదుటన్ జెప్పుము సంశయింపకు పరోక్షేచ్ఛావిహారక్రియా
స్పదముల్ లక్ష్యము సేయ కీవను మహావ్యక్తిత్వమున్ నిల్పు
మభ్యుదయంబున్ క్షయమున్ గలాదె ప్రజలున్ భూషించినన్ దిట్టినన్.