ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 87| 16th September 2023
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 87
వక్తలు :
- శ్రీమతి కారుపోతుల ఉమా మహేశ్వరి మౌనిక, పాత ఇసుకపల్లి
- శ్రీమతి సాగిరాజు అనసూయ, ముక్కొల్లు
181వ పద్యము
నీలోనున్నవి పంచభూతములు వానిన్ దీక్షలో బట్టినన్
జాలున్ లోకము కాలమున్ మృతియు జంచత్ ద్వంద్వ సామాగ్రిపో
జాలున్ జీకటి విచ్చు నీ మనసులో జాజ్జ్వల్యమానంబు నెం
తే లావెక్కుస్వతంత్రుడీవనుచు నీవే సృష్టిగా నెంచినన్.
182వ పద్యము
చిన్నవి నైచ్యభావములఁ జెంద కజాండము బట్టుకొమ్ము నిం
దున్న మహత్పదార్థముల నొంచి స్వతంత్రత నించి యీశ్వరుం
డున్న కవాటముల్ తెఱచి నుజ్జ్వలరూపరసానుషంగ సం
పన్నత నీ మహామహిమఁ బర్వఁగ సృష్టిని నూఁపివేయుమీ.